బాబుకు రాజకీయ సమాధి తప్పదు
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీ పడ్డ చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనకదుర్గ వారధి జాతీయ రహదారిపై శనివారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. విష్ణు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు చేపట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ జనరల్ సెక్రటరీలు ఎం.రాజేశ్వరరావు, టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్.శాంతిభూషణ్, ఆకుల శ్రీనివాసకుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఉపాధ్యక్షులు ఖుర్షీదా, సేవాదళ్ చైర్మన్ భవానీ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
పార్టీల సమస్య కాదు.. రాష్ట్ర సమస్య
విజయవాడ (బస్‌స్టేçÙన్) : ఇది పార్టీల సమస్య కాదు, రాష్ట్ర సమస్య అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేష్ అన్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా పండిట్‌నెహ్రూ బస్‌స్టేçÙన్ వద్ద వైఎస్సార్ సీపీ, సీపీఏం, సీపీఐ, సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హోదా కోసం పోరాడాలని చెప్పారు. సీపీఏం నగర కార్యదర్శి కాశీనాథ్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడీ శంకర్, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె. పోలారి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మద్దా శివశంకర్, దామోదర్, నేతలు కమ్మరి నాగేశ్వరరావు, కొమిరి వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. బస్‌స్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్న సీపీఏం, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులను అరెస్ట్ చేసి తోటవల్లూరు పోలీస్‌స్టేçÙన్కు తరలించారు.