‘ఉద్దానం’పై నేడు సీఎంకు నివేదిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడి
విశాఖ సిటీ: శ్రీకాకుళం జిల్లా ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధులపై హార్వర్డ్ వైద్య బృందం రూపొందించిన నివేదికను సోమవారం సీఎం చంద్రబాబుకు అందజేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదివారం విశాఖలోని వి–కన్వెన్షన్ సెంటర్లో ఉద్దానం కిడ్నీ వ్యాధులపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. అవసరమైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు కూడా కోరతానని చెప్పారు.