Haryana panchayat
-
అక్కడ మహిళలకు జీన్స్, మొబైల్ నిషిద్ధం
సాక్షి, ఛండీగర్ : మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతుంటే పలు రూపాల్లో వివక్ష వారిని వెంటాడుతూనే ఉంది. యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్ ఫోన్లు వాడరాదని హర్యానాలోని ఓ గ్రామ పంచాయితీ నిర్ణయం తీసుకుంది. సోనిపట్ సమీపంలోని ఇసీపూర్ ఖేదీ గ్రామ పంచాయితీ ఈ మేరకు తీర్మానించింది. గ్రామ పెద్దల నిర్ణయంపై యువతులు సహా పలువురు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ‘తామేం ధరించాలన్నది సమస్య కాదని..పురుషుల మనస్తత్వంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నా’యని గ్రామంలోని యువతులు చెబుతున్నారు. వేసుకున్న దుస్తుల ప్రకారం ఓ మహిళ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజస్ధాన్లోనూ గత ఏడాది జులై 27న ధోల్పూర్ జిల్లాలోని ఓ పంచాయితీ యువతులు జీన్స్ వేసుకోరాదని, మొబైల్ ఫోన్లు వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజస్థాన్ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. -
రేప్ నిందితులకు చెప్పు దెబ్బలు
ఫరీదాబాద్: హర్యానాలోని ఓ పంచాయతీ పెద్దలు అత్యాచార బాధితులకు అనూహ్యమైన శిక్ష విధించింది. ఓ అమ్మాయిని అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను ఐదుసార్లు చెప్పు దెబ్బలు కొట్టాలని, వారి నుంచి 50 వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేయాలని పంచాయతీ తీర్మానించింది. కాగా బాధిత కుటుంబం పంచాయతీ తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జకోపూర్ గ్రామంలో 15 ఏళ్ల అమ్మాయి నీళ్ల తెచ్చేందుకు బోరు పంపు వద్దకు వెళ్లింది. బంధువులయిన మునాఫత్, జబీద్ ఆమెను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి జరిగిన విషయంలో ఇంట్లో చెప్పింది. ఈ విషయం పంచాయతీ పెద్దలకు వద్దకు వెళ్లడంతో నిందితులకు శిక్ష విధించారు. బాధిత కుటుంబం పంచాయతీ తీర్పు తమకు సమ్మతం కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.