ఫరీదాబాద్: హర్యానాలోని ఓ పంచాయతీ పెద్దలు అత్యాచార బాధితులకు అనూహ్యమైన శిక్ష విధించింది. ఓ అమ్మాయిని అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను ఐదుసార్లు చెప్పు దెబ్బలు కొట్టాలని, వారి నుంచి 50 వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేయాలని పంచాయతీ తీర్మానించింది. కాగా బాధిత కుటుంబం పంచాయతీ తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల జకోపూర్ గ్రామంలో 15 ఏళ్ల అమ్మాయి నీళ్ల తెచ్చేందుకు బోరు పంపు వద్దకు వెళ్లింది. బంధువులయిన మునాఫత్, జబీద్ ఆమెను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి జరిగిన విషయంలో ఇంట్లో చెప్పింది. ఈ విషయం పంచాయతీ పెద్దలకు వద్దకు వెళ్లడంతో నిందితులకు శిక్ష విధించారు. బాధిత కుటుంబం పంచాయతీ తీర్పు తమకు సమ్మతం కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేప్ నిందితులకు చెప్పు దెబ్బలు
Published Mon, Jun 1 2015 5:17 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement