సీబీఐ విచారణపై రాబర్ట్ వాద్రాకు ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. వాద్రా భూముల కొనుగోళ్ళ వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైన విషయం తెలిసిందే.
వ్యవసాయ భూములను ప్రతిపాదిత అవసరాల కోసం కాకుండా వేరే అవసరాలకు వాడుకోవడానికి అనుమతించడంపైన కూడా విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లా...సీబీఐ విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.