అయ్యో.. గణేషా.. ఎంత పనిచేస్తివి బిడ్డా!
రెండేళ్ల కిందట పుట్టిన కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వచ్చీ రాని మాటాలతో ముద్దు ముద్దుగా మాట్లాడే ఆ బాలుడిని అపురూపంగా చూసుకున్నారు. అయితే అప్పటి వరకు అల్లరి చేసిన ఆ చిన్నారిని మృత్యువు నీటి తొట్టి (బకెట్) రూపంలో ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చింది.
- నీటితొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
- గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
- హవేళిగణపూర్లో విషాదం
మెదక్ రూరల్: మండల పరిధిలోని హవేళిగణపూర్ గ్రామానికి చెందిన మూగ రమేష్, కృష్ణవేణి దంపతులు కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండేళ్ల కిందట కుమారుడు గణేష్ జన్మిం చాడు. సోమవారం ఉదయమే రమేష్ కూలీ పనులు వెళ్లగా.. కృష్ణవేణి వంట చేసి పనులకు వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే కుమారుడిని ఆడించుకుం టూ వంట చేస్తోంది. అయితే వంట ప నిలో కృష్ణవేణి నిమగ్నమవ్వగా.. గణేష్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అక్క డే ఉన్న నీటి బకెట్లో పడిపోయాడు. కాగా కుమారుడి చప్పుడు లేకపోవడంతో అనుమానంతో కృష్ణవేణి బయటకు వచ్చింది.
అప్పటికే గణేష్.. నీటి బకెట్లో తల నీటిలో కాళ్లు పైకి కనిపిస్తుండడంతో వెంటనే బయటకు తీసి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షిం చిన వైద్యులు అప్పటికే మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. కాగా ఏకైక సంతానం మృతి చెందడంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఆడుకున్న కుమారుడు క్షణాల్లో విగత జీవుడిగా మారడంతో వారు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.