వింత శిశువు జననం..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేరామేరి మండలం గొండుగూడ గ్రామానికి చెందిన రాధిక అనే మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళవారం కేరామేరి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. రాధిక ఈ రోజు ఇద్దరు అమ్మాయిలకు జన్మ నిచ్చింది.
వారిలో ఓ పాప తల, రెండు చేతులు లేకుండా పుట్టింది. మరో పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది. పోషకాహార లోపం కారణంగానే ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు వెల్లడించారు.