బాలికలు అప్రమత్తంగా ఉండాలి
రెడ్ అలెర్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
మహబూబాబాద్ రూరల్ : బాలికలు తమ నిత్య జీవితంలో అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ హెడ్ ఆఫ్ది డిపార్ట్మెంట్, దక్షిణాఫ్రికాకు చెందిన మ్యాథ్యూస్, ముంబాయికి చెందిన సిస్టర్ సోహాలి అన్నారు. ఆపరేషన్ రెడ్ అలెర్ట్ ఆన్ ఇనిటియాటివ్ ఆఫ్ మై ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని జమాండ్లపల్లి హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అనంతరం బాల్యవివాహాలు, చైన్ స్నాచింగ్, తనకుతాను రక్షించుకోవటం, ఎదుటి బాలికలను సంరక్షించటం, ప్రలోభాలకు లోనుకాకుండా ఉండటం ఇలాంటి అంశాలపై వివరించారు. సాయంత్రం సినిమా ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం బి.అంజయ్య, సంస్థ నేషనల్ కో-ఆర్డినేటర్ వీవీఎన్, తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హానోక్, హోప్ ఏరియా కోఆర్డినేటర్లు కిషోర్, మహేశ్, ఉపాధ్యాయ బృందం శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సరస్వతి, ఎస్ఎస్వీఆర్ఎస్ శర్మ, వెంకటేశ్వర్లు, ముత్తయ్య, మురళీధర్, కరుణశ్రీ, విజయరాణి, బ్రహ్మచారి, విజయలక్ష్మి, అంబరీష, సీఆర్పీ బోడ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.