ఆ కళాశాలల్లో ఒక్క సీటు కూడా పోదు
ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కళాశాలల సీట్లపై లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కళాశాలల సీట్లు యథాతథంగా ఉంటాయని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఎంసీఐ ఎత్తి చూపిన లోపాలన్నింటినీ సరిదిద్దాలని, సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తాను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో మాట్లాడతానని చెప్పారు. సచివాలయంలోని తన చాంబర్లో ఆయన ఈ మెడికల్ కళాశాలలపై ఉన్నతస్థారుులో సమీక్షించారు. ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు లోపాలను ఎత్తి చూపింది.
విద్యార్థుల నిష్పత్తికి సరిపడా భవనాలు, అధ్యాపక సిబ్బంది, పరికరాలు లేవని తేల్చింది. ఫలితంగా కొన్ని సీట్లను రద్దు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో మంత్రి... నిర్మాణ పరమైన లోపాలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఔషధ సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను ఆదేశించారు. తగిన విధంగా భవనాలను సవరించాలని, అవసరమైతే కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. అలాగే పరికరాలకు వెంటనే మరమ్మతులు చేరుుంచాలన్నారు. తదుపరి తనిఖీ నాటికి అన్నింటినీ సిద్ధం చేయాలన్నారు.