Heart Shape Design
-
అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి వేడుక ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ఆ అంబానీ కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాలు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. జూలై 12న అనంత-రాధికల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో నీతా రాణి పింక్ లెహంగా చోళీలో అద్భుతంగా కనిపించారు. ఆ డిజైనర్ లెహంగాకి తగ్గట్లు ఆమె ఎంచుకున్న కాంతీలాల్ ఛోటాలాల రూపొందిచిన వజ్రాభరణాలు మరింత అందాన్ని తెచ్చిపెటట్టాయి ఆమెకు. అలాగే చేతులకు డైమండ్ బ్యాంగిల్స్ ధరించింది. ఈ అలంకరణలో అందరి దృష్టి ఆమె ధరించిన హృదయకారపు ఉంగరంపైనే పడింది. ఇదే ఉంగరాన్ని ఆమె కూతురు ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌లో ధరించింది. ప్రస్తుతం ఈ తల్లి, కూతుళ్ల ద్వయం సేమ్ రింగ్‌ని ధరించడం నెట్టింట కాస్త హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో నీతా ధరించిన ఆభరణాలు చాలా హైలెట్‌గా నిలిచాయి.నీతా ధరించిన ఆభరణాలు..కాంతిలాల్ ఛోటాలాల్ రూపొందించిన ఆభరణాలు నీతా కంఠానికి ఎగ్జాట్‌గా సరిపోయాయి. రోజ్ కట్ డైమండ్లు ఆమె మెడను మిరమిట్లుగొలిపే కాంతితో నింపాయి. ఆమె తలకు ధరించిన పాపిడి బొట్టు, చెవిపోగులు.. ప్రతీదీ కళాత్మకంగా ఉంది. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!) -
హార్ట్లీ హాట్
సిగ సింగారం ఇది హార్ట్ బన్ హెయిర్ స్టయిల్.. దీన్ని యువత బాగా ఇష్టపడుతుంది. గాగ్రా, లాంగ్ స్కర్ట్స్, జీన్స్‌కు ఈ హెయిర్ స్టయిల్ బాగా నప్పుతుంది. ఇందులో హార్ట్ షేప్ డిజైన్ ఉండటం వల్ల దీన్ని ‘హార్ట్ బన్’ అంటారు. దీన్ని చాలామంది అమ్మాయిలు వాలెంటైన్స్‌డే రోజు తప్పకుండా వేసుకుంటారట. అంత అందంగా ఆకర్షణీయంగా ఉండే ఈ హార్ట్ బన్ను మీరూ ట్రై చేయండి. 1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలాగే ఈ హెయిర్ స్టయిల్‌కు కర్లీ హెయిర్ బాగా నప్పుతుంది కాబట్టి మీ జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా హెయిర్‌ను కర్లీగా చేసుకోండి. 2. ఇప్పుడు ముందు భాగం నుంచి జుత్తును రెండుభాగాలుగా విడదీసి.. విడివిడిగా రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టాలి. తర్వాత చిక్కులు లేకుండా జుత్తునంతా దువ్వుకోవాలి. 3. ఆపైన ఆ రెండు పోనీలలో ఒకదాన్ని తీసుకొని మెలితిప్పాలి. అప్పుడు మిగిలిన పోనీ కదలకుండా జాగ్రత్త పడాలి. 4. ఆ మెలితిప్పిన పోనీని ఫొటోలో కనిపిస్తున్న విధంగా తిప్పుకుంటూ పోవాలి. 5. ఇప్పుడు దాన్ని హార్ట్ షేప్‌లో సగభాగంలా చేసి ఫొటోలో కనిపిస్తున్నట్టుగా మూడు చోట్ల స్లైడ్స్ పెట్టేయాలి. 6. అలాగే రెండో పోనీని కూడా మెలితిప్పాలి. చిన్న చిన్న వెంట్రుకలు మధ్యలో వస్తూ ఉంటే.. హెయిర్ స్ప్రే చేసుకుంటే సరి. 7. ఇప్పుడు ఆ మిగిలిన హార్ట్ భాగాన్ని రెండో పోనీతో పూర్తి చేసి స్లైడ్స్ పెట్టేయాలి. తర్వాత హార్ట్ షేప్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి. రెండు పోనీల చివర్లు కలిసిన చోట మరో రెండు స్లైడ్స్ లేదా ఏదైనా క్లిప్ లేదా ఆర్టిఫీషియల్ ఫ్లవర్‌తో అలంకరించుకొని, మరోసారి జుత్తునంతా దువ్వుకోవాలి.. అంతే! మీ హార్ట్ బన్ అందరి హార్ట్స్‌ను కొల్లగొట్టడం ఖాయం.