'ఆమెను ఎప్పుడూ చూడలేదు'
ముంబై: మహిళపై దాడి చేశారని తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తోసిపుచ్చాడు. తనపై ఫిర్యాదు చేసిన హీనా షేక్ అనే మహిళ గురించి తనకు తెలియదని, ఆమెనెప్పుడూ హౌసింగ్ సొసైటీలో చూడలేదని తెలిపాడు. ఫిర్యాదుపై జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులెవరూ సంతకాలు చేయలేదని వెల్లడించాడు.
తాను ఈజీ టార్గెట్ గా మారినట్టు భావిస్తున్నానని, వాస్తవాలు వెల్లడించేందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. మహిళను దూషించి, చేయి చేసుకున్నానని తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కుట్రపూరితంగా ఇదంతా చేశారని ఆరోపించారు.
జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వివాదం తలెత్తడంతో సిద్దిఖీ తమపై దౌర్జన్యం చేశాడని వెర్సోవా పోలీసుస్టేషన్ లో హీనా షేక్ ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా నవాజుద్దీన్ భార్య ఆలియా రెండు రోజుల తర్వాత అదే పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.