సారొస్తారని..
సాక్షి, కడప : ముఖ్యమంత్రి గండికోట ప్రాజెక్టు పరిశీలనకు వస్తారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎదురు చూసిన టీడీపీ ప్రజాప్రతినిధులకు నిరాశే మిగిలింది. అన్ని ఏర్పాట్లు చేసి సీఎం రాక కోసం వేచి ఉన్న అధికారులకు ‘గండికోట’పై సీఎం ఏరియల్ సర్వే మాత్రమే చేస్తారనే సమాచారం రావడంతో అందరూ కడప ఎయిర్‌పోర్ట్‌కు బయలు దేరారు. సీఎం ఏరియల్ సర్వే ముగించుకుని హెలికాఫ్టర్‌లో కడప విమానాశ్రాయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ వెళతారని భావించి ప్రజాప్రతినిధులు సైతం అక్కడికే బయలుదేరారు.
ఏకంగా సీఎం పర్యటనే రద్దు అయిందని సమాచారం అందడంతో విమానాశ్రయం నుంచి అందరూ తిరుగుముఖం పట్టారు. శుక్రవారం సాయంత్రం సీఎం ‘అనంత’ నుంచి హెలికాఫ్టర్‌లో గండికోటకు చేరుకుని, అక్కడ జరుగుతున్న టన్నెల్ పనులు పరిశీలించాల్సి ఉండింది. అనంతరం పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. తీరా పర్యటన రద్దు కావడంతో లక్షలాది రూపాయల ఖర్చు వృధా అయింది. ప్రత్యేక విమానం సైతం వెనక్కు వెళ్లింది. సీఎం చంద్రబాబు పర్యటన రద్దు కావడం ఇది రెండవసారి. గత ఏడాది సెప్టెంబర్‌లో
సారొస్తారని..
రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లెలో జన్మభూమి గ్రామ సభకు హాజరు కావాల్సి ఉండగా చివరి క్షణంలో రద్దయింది.
భారీ ఏర్పాట్లు
చంద్రబాబు పర్యటన కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాగతం పలికేందుకు కడప ఎయిర్‌పోర్టుతోపాటు గండికోటలోనూ జిల్లా కలెక్టర్ కేవీ రమణతోపాటు జేసీ రామరావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి (వాసు), బద్వేలు నేతలు విజయమ్మ, విజయజ్యోతి, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, కడప నేతలు దర్గాప్రసాద్, గోవర్దన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, రాయచోటి నాయకుడు రమేష్‌రెడ్డి, యెద్దల సుబ్బరాయుడు తదితరులు తరలివచ్చారు. బందోబస్తు విధులకు చిత్తూరు ఎస్పీ కూడా హాజరయ్యారు.