ఎయిర్‌పోర్టా.. హెలిపోర్టా!
తాడేపల్లిగూడెం : సీఎం ఎన్.చంద్రబాబు తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ప్రకటించగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక గజపతిరాజు తాడేపల్లిగూడెంలో హెలిపోర్టు మాత్రమే ఏర్పాటు చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజాప్రతి నిధులు, జిల్లా ప్రజలను అయోమయంలో పడేశాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇక్కడ నిర్మించిన విమానాశ్రయూన్ని పునరుద్ధరిస్తారా లేక కేంద్ర మంత్రి ప్రకటించిన విధంగా హెలిపోర్టుగా మారుస్తారా అనేది చర్చనీయూంశంగా మారింది.
హెలిపోర్టు అంటే...
హెలిపోర్టులు విదేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకేచోట ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లను ల్యాండ్ చేసేందుకు వీలుగా నిర్మించే వాటినే హెలిపోర్టులని పిలుస్తుంటారు. వీటిని అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్నారు. వీటిలో విమానాలు దిగే వీలుండదు. హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతారుు. ఒక్కొక్క హెలిపోర్టులో రెండు లేదా మూడు హెలిప్యాడ్లు ఉంటా యి. విదేశాల్లో అరుుతే నగరాలు, పట్టణాలకు దూరంగా వీటిని నిర్మిస్తున్నా రు. సమీపంలోని ఎయిర్ పోర్టులకు ప్రయూణికులను హెలికాప్టర్లలో చేరవేయడానికి హెలిపోర్టులను వినియోగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి రోగులను అత్యవసర చికిత్సల కోసం పెద్దాస్పత్రులకు తరలించడానికి, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు అత్యవసర పర్యటనలకు వచ్చే సమయంలోను, అత్యవసర సమయూల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలిపోర్టులను వినియోగిస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో కస్టమ్స్ అధికారులు వీటిని వినియోగించుకుంటారు.
విలువైన వస్తువులను హెలికాప్టర్లలో హెలిపోర్టు ద్వారా పంపిస్తారు. వీటిలో ఎయిర్‌పోర్టుల మాదిరి పెద్దగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉండదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిర్మించిన తాడేపల్లిగూడెం విమానాశ్రయాన్ని హెలిపోర్టుగా వాడుకుంటామని కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి పి.అశోకగజపతిరాజు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఎయిర్ పోర్టుకు బదులుగా హెలిపోర్టు ఏర్పాటు చేస్తారా లేక ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు విమానాశ్రయూన్ని పునరుద్ధరిస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఏమో మరి
తాడేపల్లిగూడెంలో హెలిపోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి పి.అశోక గజపతిరాజు చేసిన ప్రకటనపై దేవాదాయ శాఖ మంత్రి పైడికొం డల మాణిక్యాలరావును వివరణ కోరగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. జాతీయ వైమానిక విధానంలో భాగంగా అలాంటి చర్యలు తీసుకునే ఆలోచన ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పష్టత తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.