పిల్లలపై పెద్దల ప్రభావం
ఆదిత్య టైటిల్ పాత్ర పోషించిన బాలల చిత్రం ‘ఆత్రేయ’. అనూహ్య, జీవా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి శాంతికుమార్ చిలుముల దర్శకుడు. స్టార్ట్ (సర్వీస్ త్రూ ఆర్ట్) హెల్ప్ ఫౌండేషన్-డాట్కామ్ ఆర్ట్ క్రియేషన్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న బాలల దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లల పెంపకంలో పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తల నేపథ్యంలో సాగే కథాంశమిది. కథానుగుణంగా కావాల్సినంత వినోదం కూడా ఉంది. పెద్దల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సినిమా ద్వారా తెలుపుతున్నాం. ఆత్రేయగా ఆదిత్య, ఎలైస్గా అనూహ్య చక్కగా నటించారు. జీవా మంత్రిగా నటించారు’’ అని తెలిపారు.