లంచం అడితే 011-27357169కు ఫోన్ చేయండి
న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందిస్తానని హస్తిన పీఠమెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ తన హామీని నిలబెట్టుకుంటున్నారు. లంచగొండుల భరతం పట్టేందుకు ఆయన హెల్ప్‌లైన్ ప్రకటించారు. మూమూళ్లు మరిగిన ప్రభుత్వ అధికారులకు కళ్లెం వేసేందుకు 011-27357169 హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించారు.
అయితే దీని ద్వారా ఫిర్యాదు చేసే వీలులేదని, కేవలం హెల్ప్‌లైన్ నంబర్ మాత్రమేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవినీతి అధికారులను సాక్ష్యాధారాలతో ఎలా పట్టివ్వాలనే దానిపై హెల్ప్‌లైన్ ద్వారా సూచిస్తామని తెలిపారు. ఇందుకు ఢిల్లీ అవినీతి వ్యతిరేక విభాగం సహాయపడుతుందని చెప్పారు. హెల్ప్‌లైన్‌తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమన్నారు. లంచం తీసుకునేందుకు అధికారులు భయపడతారన్నారు. ప్రతి పౌరుడు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు కావాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు.