ఆహా ఏమి రుచి... తినరా మైమరచి..
అవునండీ... నిజమే. మీరు చూస్తున్నది కోడే. అయితే దీనికి ఇంత లావు కాళ్లేమిటనేదేగా మీ సందేహం. దీని తీరే ఇంత. చూడడానికి ఇలా కొంచెం ఎబ్బెట్టుగా కనిపించినా ఒక్కసారి దీని కూర రుచి చూశారో ఎవరైనా మైమరచిపోవాల్సిందే. దీనిపేరు డోంగ్తావ్. వియత్నాం రెస్టారెంట్లలో అత్యధికంగా అమ్ముడయ్యేది ఈ కోడి కూరే. అందుకే వీటి పెంపకందార్ల ఆనందానికి అంతే లేదు. ఇది మూడు నుంచి ఆరు కిలోల బరువు ఉంటుంది.
ఈ కోడి కూరకి వియత్నాంలో చెప్పలేనంత గిరాకీ. మామూలు రోజుల్లో దీని ఖరీదు మన కరెన్సీలో సుమారు రూ. 1,350. అది కూడా కోడి రకాన్ని బట్టి ఉంటుంది. ఇక కొత్త సంవత్సరం ఆరంభంలో అయితే ఏకంగా దాదాపు రూ. 18 వేలు పలుకుతుంది.