High acreage
-
అల్లం.. సస్యరక్షణతో మేలు
- తెగులు నివారిస్తే అధిక దిగుబడి - ఎనిమిది నెలల పంట - పెట్టుబడి అధికం - ఏడీఏ వినోద్‌కుమార్ సలహాలు, సూచనలు జహీరాబాద్ ప్రాంతంలో రైతులు అల్లం పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సారవంతమైన ఎర్ర నేలల్లో అల్లం దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్ల రేగడిలోనూ పండుతుంది. ఎనిమిది నెలలకు చేతి కొచ్చే ఈ పంట సాగుకు ఖర్చు అధికం. దిగుబడి కూడా అంతేస్థాయిలో ఉండడంతో రైతులు అల్లం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్ (సెల్: 72888 24499) తెలిపారు. - జహీరాబాద్ టౌన్ విత్తన రకాలు: - అల్లంలో మారన్, మెదక్, సుపభ్ర, సురచి, సురభి, వైనాడ్, నదియా వంటి రకాలున్నాయి. - జహీరాబాద్ ప్రాంత నేలలకు మారన్ రకం అనుకూలం. - ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. - విత్తనం పొడుగు 4.5 సె.మీ., 30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులండాలి. - 500 గ్రాముల ఎం 45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. - విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజులపాటు ఆరబెట్టాలి. - ఎకరానికి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. సాగు విధానం: - సారవంతమైన ఎర్ర, నల్ల రేగడి నేలలు అల్లం సాగుకు అనుకూలం. - పొలాన్ని లోతువరకు దున్ని దుక్కిచేసుకోవాలి. - ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ) ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ ఫాస్పేట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్‌పై వేయాలి. - బెడ్‌ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. - క్రమం తప్పకుండా నీటి తడులు పెడుతుండాలి. - డ్రిప్ విధానం చాలా మంచిది. యాజమాన్య పద్ధతులు: - విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమోనియా సల్ఫేట్, 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. - 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి. - 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. - 150-180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ ఒక గ్రాము వేయాలి. తెగులు నివారణ: రైజోమ్వాట్: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే: ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్‌డిజమ్ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అల్లం పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవచ్చు. మామిడి తోటల్లో కూడా అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. -
వరి.. జాగ్రత్తలివిగో..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి, సోయాబిన్ పంటల తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి. అయితే ఈ ఏడాది వర్షాలు ఆశించినస్థాయిలో కురవలేదు. ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా వర్షాభావ పరిస్థితులతో జూన్, జూలై, ఆగస్టు మూడో వారం వరకు సా ధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీం తో వరిసాగు 38వేల ఎకరాలకే పరిమితమైంది. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల్లోకి నీరు చేరడంతో కొందరు రైతు లు ముదిరిన నారును నాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగులో యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ రైతులకు వివరించారు. ఎక్కువగా ఆశించే తెగుళ్లు.. జింక్ ధాతు లోపంతో వరి ఇటుక రంగులో, ముదురు ఆకులు ఎరుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం జరుగుతుంది. అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు, తాటాకు తెగులు, పురుగు ఉల్లికోడు, మధ్యస్థాయి నుంచి కోత దశలో తెల్లదోమ వ్యాప్తి చెందుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల తర్వాత పైరజోసల్ఫ్యుర్ ఎకరానికి 80 గ్రాములు లేదా 20 రోజుల తర్వాత ఇతాక్సిసల్ఫ్యురాన్ ఎకరానికి 50 గ్రాముల చొప్పన 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. నాట్లు వేసిన 30 నుంచి 35 రోజుల్లో గడ్డి జాతి, కలుపు నివారణకు బిస్ పైర్ బాక్ సోడియం ఎకరానికి 100 మిల్లీలీటర్లు 05 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చే యాలి. 30 నుంచి 40 రోజుల వ ్యవధిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు, తాటాకు తెగులు ఆకుముడుత లాంటి పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా పొలంలో నీటిని తీసివేసి ఎకరానికి కార్బోప్యురాన్ 10 కిలోలు లేదా ఫోరేట్ 5 కిలోల గుళికలు వేయాలి. కాండం తొలుచు పురుగు తర్వాతి దశలో క్లొరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 లేదా కార్టప్ హైడ్రోక్టోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరాంత్రి నిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట మధ్య లేదా చివరి దశలో సుడి దోమ రాకుండా ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు విడవాలి. నివారణకు బూప్రోపెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇతో ఫెన్ ప్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి లేదా ఇమిడా క్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదటి దశలో వచ్చే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్ల్జోల్ 6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలేన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగమైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కలుపు యాజమాన్య పద్ధతులు వరి నాటిన 3 నుంచి 5 రోజుల్లోగా ఊద మొదలగు ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 1 నుంచి 1.5 మిల్లీలీటర్లు లేదా అనిలోపాస్ 500 మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాకోర్ 500 మిల్లీలీటర్ల మందును అర లీటరు నీటిలో కలిపి పొలంలో పలుచగా నీరుంచి సమానంగా వెదజల్లాలి. దీంతో గడ్డి, తుంగ, వెడల్పాటి కలుపు మొక్కలను నశింపజేయవచ్చు. ఎరువులు ఇలా వేసుకోవాలి.. జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా యి. ఈ వానలు పంటలకు మేలు చేకూర్చాయి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకొని ఎరువులు వేసుకోవాలి. వరి గంట పోసే దశలో ఎకరాకు 30 కిలోల యూరియా, చిరుపొట్ట దశలో 30 కిలోల యూరియా, 13 కిలోల ఎంవోపీని చల్లుకోవాలి. నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదులోనే దఫాలుగా వేసుకుంటే అగ్గితెగులు, కాండం తొలుచు పురు గు వంటి చీడపీడలను నివారించవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. నాటు వేసిన వెంటనే (3-5 రో జులకు) కలుపు నివారణకు పైరజో సల్ఫురాన్ ఇథైల్ మందు 80గ్రాములు ఒక ఎకరానికి ఇసుకలో కలిపి తేలిక పదునులో వెదజల్లుకోవాలి. నాటిన 20-25 రోజుల్లోపు కలుపు నివారణకు బిస్పై రిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. దుబ్బు చేసే దశలో అధిక నీటి ని ఇవ్వకూడదు. నాటిన 15 రోజులకు కార్బోప్యూరా న్ 3జీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి.