కాచిగూడ రైల్వేస్టేషన్లో హైస్పీడ్ వైఫై
కాచిగూడ రైల్వేస్టేషన్లో గురువారం నుంచి ప్రయాణికులకు హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫాం వద్ద జరుగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇప్పటికే సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే.