highest earning
-
సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు
న్యూజెర్సీ: 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ అత్యధికంగా ఏడాదికి 922 కోట్లు(125 మిలియన్ డాలర్లు) అర్జిస్తూ టాప్‌లో నిలిచాడు. ఇటీవలే జువెంటస్ క్లబ్‌ను వదిలి మాంచెస్టర్ యునైటెడ్‌కు బదిలీ అయిన సీఆర్7.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(811 కోట్లు)ని రెండో స్థానానికి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. జీతభత్యాల ద్వారా 70 మిలియన్ డాలర్లు పొందే రొనాల్డొ.. కమర్షియల్ డీల్స్ రూపేనా మరో 55 మిలియన్ డాలర్లు జేబులో వేసుకుంటున్నాడు. మరోవైపు రొనాల్డొ సమవుజ్జీ అయిన మెస్సీ.. జీతం ద్వారా 75 మిలియన్ డాలర్లు, ఇతర ఎండార్స్మెంట్ల రూపేనా మరో 35 మిలియన్ డాలర్లు అర్జిస్తున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మార్(95 మిలియన్ డాలర్లు), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90 మిలియన్ డాలర్లు), ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(65 మిలియన్ డాలర్లు), ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్(70 మిలియన్ డాలర్లు) ఉన్నారు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస -
ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక
అత్యధిక సంపాదన ఉన్న టీవీ స్టార్లలో ఎనిమిదో స్థానం న్యూయార్క్: ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ మేగజీన్ ఈఏడాదికిగాను ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టీవీ నటీమణుల జాబితాలోబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్థానం సంపాదించింది. 15 మంది ఉన్న ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ప్రియాంక... ఈ ఘనత సాధించిన తొలి భారతీయనటిగా రికార్డు సృష్టించింది. అమెరికా టీవీ షో క్వాంటికో ద్వారా గతేడాది అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు రూ.73.72 కోట్లు (11 మిలియన్ డాలర్లు) సంపాదించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. అమెరికా నటి సోఫియా వెర్గారా రూ.288.18 కోట్ల (43 మిలియన్ డాలర్లు)తో వరుసగా ఐదోసారీ తొలిస్థానంలో నిలిచింది. సూపర్ హిట్ టీవీ షో... మోడరన్ ఫ్యామిలీలో వెర్గారా చేస్తోంది. వీటితో పాటు ఎండార్స్మెంట్లు తదితరాల ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించింది. రూ.160.84 కోట్ల ఆదాయంతో కాలె కువాకో, రూ.100.53 కోట్లతో మిన్డీ కాలింగ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రూ.97 కోట్ల చొప్పున ఎలెన్ పాంపియో, మరిస్కా హర్గిటే సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. శాండల్ నటి కెర్రీ వాషింగ్టన్ (రూ.90.47 కోట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. అయితే... హాలీవుడ్లో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సంపాదనలో ఎంతో వ్యత్యాసం ఉందని, దీన్ని వారు చేరుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉందని మేగజీన్ పేర్కొంది.