Highest Honour
-
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్‌ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్‌కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
కిరణ్ షాకు అత్యున్నత పౌర పురస్కారం
సాక్షి, బెంగళూరు: బయోకాన్ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్-షా తన ఖాతాలో అత్యున్నత అవార్డును జమ చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ను అందుకున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాన్ని అభివృద్ధి చేయడంలో చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంబంధాలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన సేవ చేసినందుకు ఆమెకు అత్యున్నత పౌర గౌరవ అవార్డును అందించడం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అరుదైన ఈ గౌరవం దక్కడం తనకెంతో సంతోషంగా వుందని కిరణ్ షా పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కాంగ్రెస్ నేత ఆర్వి దేశ్‌పాండే, డాక్టర్ దేవి శెట్టి వంట దిగ్గజాల సమక్షంలో కిరణ్ షా ఈ అవార్డును అందుకున్నారు. క్యాన్సర్ పరిశోధన, మహిళా సమస్యలపై కిరణ్ షా ప్రదర్శించిన నిబద్ధతతో పాటు, బెంగళూరు నగరాన్నిజీవించగలిగే నగరంగా ఉండేలా చేయడంలో ఆమె కృషి మనందరికీ తెలుసంటూ ఆస్ట్రేలియా హైకమిషనర్ హరీందర్ సిద్ధూ కిరణ్ షాను ప్రశంసించారు. ప్రపంచంలో విశేషమైన మార్పునకు నాందిపలికిన వ్యక్తులను గుర్తించడం చాలా అద్భుతంగా ఉందన్నారు. కాగా ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ఫిబ్రవరి 14, 1975న ది క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయులోనాల్గవ వారు. మదర్ థెరిసా, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ గౌరవాన్ని అందుకున్నారు. The Australian Govt. has invested @kiranshaw as an Honorary Member within the #OrderofAustralia (AM) today. Delighted to present this award - Australia’s highest civilian honour - in recognition of her immense contribution in advancing the Australia-India bilateral relationship. pic.twitter.com/x5J6zoHn3G — Harinder Sidhu (@AusHCIndia) January 17, 2020 -
రాష్ట్రపతి ప్రణబ్ కు అత్యున్నత పురస్కారం
అబిద్ జాన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు ఐవరీ కోస్ట్ తమ దేశ అత్యున్నత పురస్కారం కోట్ డీ ఐవరీని ప్రధానం చేసింది. మూడు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా బుధవారం అబిద్ జాన్ నగరానికి వెళ్లిన రాష్ట్రపతికి ఆ దేశాధ్యక్షుడు అలస్సానే ఒట్టారా దేశ అత్యున్నత పురస్కారం తో సత్కరించారు. కాగా, ప్రపంచ దేశాల నుంచి ఎన్నో డిగ్రీలను అందుకున్న ప్రణబ్ ఒక దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారంపై మాట్లాడిన ప్రణబ్ ఒక దేశ అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. యూఎన్, ప్రపంచవేదికలపై సహకరించుకునేందుకు ఈ పర్యటనలో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. టెర్రరిజంపై పోరాడేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని వివరించారు. ప్రస్తుతం ఇరుదేశాలు7-9 శాతం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య ఒక బిలియన్ డాలర్ల వ్యాపారాలు జరుతాయని తెలిపారు.