'ఆ నాలుగు జిల్లాలకే నష్టం ఎక్కువ'
విశాఖపట్నం: హుదుద్ తుపాన్ రేపు ఉదయం విశాఖపట్నంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెనుగాలులు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. విద్యుత్, రవాణా వ్యవస్థలు దెబ్బతింటాయని పేర్కొంది. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం దాటిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నష్టం ఎక్కువ ఉంటుందని తెలిపింది.