'బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండ'
న్యూఢిల్లీ: గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం మంగళవారం కులుమనాలి వెళ్లనుంది. విహారయాత్రలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం మాకు దిగ్భ్రాంతి కలిగించిందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం వెల్లడించింది.
బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం తరపున వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి, వైవి సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది.