ఆ దేశంలో ఇదే 'తొలి ఎంఫిల్'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ చరిత్రలోనే హిందీ భాషలో తొలి ఎంఫిల్ పూర్తయింది. ఆదేశ మిలటరీకి సంబంధించిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మోడరన్ లాంగ్వేజెస్(ఎన్యూఎంఎల్) షాహిన్ జఫార్ అనే విద్యార్థికి హిందీ భాషలో ఎంఫిల్ డిగ్రీ అందజేసింది.
అతడు 'స్వతంత్రోత్రా ఉపన్యాసన్ మెయిన్ నశ్రిచిత్రాన్(1947-2000)' అనే టాపిక్‌పై ఇఫ్తికార్ హుస్సేన్ అరిఫ్ అనే ప్రొఫెసర్ వద్ద ఎంఫిల్ పూర్తి చేశాడు. ఇందులో విశేషమేమిటంటే హిందీ భాషలో ఎంపిల్ థిసీస్ నిపుణులు పాకిస్థాన్‌లో లేకుంటే భారత్‌లోని అలీఘడ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు హిందీ ప్రొఫెసర్ల ద్వారా దీనిని పరిశీలించి ఆమోదం తెలిపారు.