వైఎస్ జగన్ జన్మదినాన ఫుడ్ కాంపిటీషన్
హిందూపురం అర్బన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 21వ తేదీ పార్టీ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు ఫుడ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన రహదారిలో బీపీఎల్ షోరూం వద్ద ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఉడికించిన కోడిగుడ్లు పది నిమిషాల్లో నీళ్లు తాగకుండా ఎవరు ఎక్కువగా తింటే వాళ్లు విజేతగా నిలుస్తారన్నారు. వారికి రూ.10,111 బహుమతిగా అందజేస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యం పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 77993 30094 నెంబర్లో సంప్రదించాలని కోరారు.