HNWI
-
ఇండియా ‘హై రిచ్’..
భారత్ సంపన్నులకు నిలయంగా మారుతోంది. దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ వారి వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం.. 85,698 మంది 10 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తులు కలిగిన హై నెట్వర్త్ వ్యక్తులతో (HNWI) భారత్ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక 2028 నాటికి భారతదేశ ఈ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభా 93,753 కు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.3.7 శాతం భారత్లోనే..ప్రపంచ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభాలో భారత్ 3.7% ఉందని నివేదిక హైలైట్ చేసింది. ఇది ప్రపంచ సంపద సృష్టిలో పెరుగుతున్న దేశ ప్రభావాన్ని సూచిస్తుంది. భారతదేశంలో హెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య సంవత్సరానికి 6% పెరిగింది. ఇది 2023 లో 80,686 నుండి 2024 నాటికి 85,698 కు పెరిగింది. ఈ వృద్ధికి దేశ బలమైన ఆర్థిక పనితీరు, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల పెరుగుదల కారణం.బిలియనీర్లలో మూడో స్థానంభారతదేశ బిలియనీర్ల జనాభా కూడా గణనీయమైన వృద్ధిని చూసింది. 2024 లో సంవత్సరానికి 12% పెరిగింది. ప్రస్తుతం దేశంలో 191 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో 26 మంది గత ఏడాదిలోనే ఈ జాబితాలో చేరారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 950 బిలియన్ డాలర్లుగా అంచనా. బిలియనీర్ సంపద పరంగా భారత్.. యునైటెడ్ స్టేట్స్, చైనా తరువాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంపద కేంద్రంగా ఉంది.లగ్జరీ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్భారతదేశంలో పెరుగుతున్న సంపద దాని సంపన్న వర్గాల ప్రాధాన్యతలలో ప్రతిబింబిస్తుంది. నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం వీరిలో 46.5 శాతం మంది లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. 25.7 శాతం మంది హైఎండ్ ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో, ఢిల్లీ లగ్జరీ ప్రాపర్టీ ధరలు 2024 లో 6.7% పెరిగాయి, నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100) లో ఇది 18వ స్థానాన్ని సంపాదించింది. ముంబై 21వ స్థానానికి చేరుకోగా, బెంగళూరు 40వ స్థానానికి ఎగబాకింది.అత్యంత లగ్జరీ వస్తువులు హ్యాండ్ బ్యాగులే.. 2024లో హ్యాండ్ బ్యాగులు టాప్ పెర్ఫార్మింగ్ లగ్జరీ అసెట్ క్లాస్ అని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) వెల్లడించింది. వీటి ధరలు 2.8% పెరిగాయి. క్లాసిక్ కార్లు, ఆర్ట్ కలెక్షన్లు, ప్రైవేట్ జెట్లు కూడా పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన పెట్టుబడి వర్గాలుగా ఆవిర్భవించాయి. -
భారత్లో కుబేరులు 1.98 లక్షల మంది
న్యూఢిల్లీ : భారత్లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దేశంలో అత్యంత సంపన్నుల (హెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య 1.98 లక్షలుగా ఉన్నట్లు వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2015 నివేదికలో వెల్లడైంది. సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిల్చింది. క్యాప్జెమిని, ఆర్బీసీ వెల్త్ మేనేజ్మెంట్ ఈ నివేదికను రూపొందించాయి. దీని ప్రకారం చమురు ధరల పతనం, నిర్మాణాత్మకమైన ఎన్నికల ఫలితాలు తదితర అంశాలు గతేడాది సంపన్నుల సంపద మరింత పెరగడానికి దోహదపడ్డాయి. హెచ్డబ్ల్యూఎన్ఐ సంపద పరంగా ఆసియా పసిఫిక్లో ఆస్ట్రేలియాను దాటి భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. 2013లో భారత్లో హెచ్డబ్ల్యూఎన్ఐల సంఖ్య 1,56,000 కాగా 2014లో ఇది 1,98,000కు పెరిగింది. అత్యధిక హెచ్ఎన్డబ్ల్యూఐలు ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోను (43,51,000 మంది), జపాన్ (24,52,000 మంది), జర్మనీ (11,41,000 మంది), చైనా (8,90,000 మంది) తర్వాత నాలుగు స్థానాల్లోనూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల సంపదలో దాదాపు 60.3 శాతం సంపద టాప్ నాలుగు దేశాల హెచ్ఎన్డబ్ల్యూఐల వద్దే ఉంది. ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్ల పనితీరు మెరుగుపడటంతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా 9,20,000 మంది మిలియనీర్లు కొత్తగా పుట్టుకొచ్చారు. దీంతో అత్యంత సంపన్నుల సంఖ్య 1.46 కోట్లకు చేరింది. వీరందరి సంపద 56.4 లక్షల కోట్ల డాలర్లకు పెరింది. హెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య పెరుగుదలలో ఆసియా పసిఫిక్ దేశాలు ముందున్నాయి. నిలకడైన వృద్ధి కొనసాగనున్న నేపథ్యంలో 2017 నాటికి ప్రపంచ దేశాల హెచ్ఎన్డబ్ల్యూఐల సంపదలో దాదాపు 10 శాతం భారత్, చైనా సంపన్నుల వద్దే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.