హాకీ ఆటగాళ్లకు వార్షిక అవార్డులు
న్యూఢిల్లీ: ప్రతిభ చూపిన హాకీ ఆటగాళ్లకు వార్షిక అవార్డులు ఇవ్వాలని భారత హాకీ సమాఖ్య నిర్ణయించింది. పురుషులు, మహిళా విభాగాల్లో అవార్డులు ఇవ్వాలని, ప్రైజ్ మనీ కింద రూ. 25 లక్షల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్టు హాకీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
ప్రస్తుత జట్టులోని సభ్యులతో పాటు రాబోయే టీమ్ లోని ఆటగాళ్లను ప్రతిభాపాటవాలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ అవార్డుల ద్వారా ఆటగాళ్లకు మేలు జరగడమే కాకుండా ఆట కూడా మంచి జరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ సింగ్ బాత్రా కుమారుడు ధ్రువ్ పేరు మీద వ్యక్తిగతంగా అవార్డులు ఇవ్వనున్నారు.