నరీందర్ బాత్రా అరుదైన ఘనత
• అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక
• ఈ ఘనత సాధించిన తొలి యూరోపేతర వ్యక్తి
దుబాయ్: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా ఆయన భారీ ఆధిక్యంతో ఎన్నికయ్యారు. 45వ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్‌లో శనివారం ఈ పదవి కోసం ఓటింగ్ జరిగింది. ఇందులో బాత్రాకు మద్దతుగా 68 ఓట్లు దక్కారుు. ఆయన ప్రత్యర్థులు డేవిడ్ బల్బిర్నీ (ఐర్లాండ్)కి 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలియా)కు 13 ఓట్లు మాత్రమే వచ్చారుు. దీంతో 12వ ఎఫ్ఐహెచ్ చీఫ్‌గా ఎన్నికై న బాత్రా ఈ పదవి చేపట్టిన తొలి ఆసియా వ్యక్తిగానే కాకుండా తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. యూరోపేతర దేశాల నుంచి ఎఫ్‌ఐహెచ్‌కు అధ్యక్షుడు ఎన్నికవడం ఇదే తొలిసారి.
మొత్తం 118 ఓట్లలో 110 మాత్రమే నమోదుకాగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. ఆసియా హాకీ సమాఖ్య అధికారిక అభ్యర్థిగా నామినేట్ అరుున 59 ఏళ్ల బాత్రాకు ఆసియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా దేశాల నుంచి అధిక మద్దతు లభించింది. 2008 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న లియాండ్రో నెగ్రే (స్పెరుున్) నుంచి బాత్రా వెంటనే బాధ్యతలు తీసుకుంటారు. నాలుగేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈనేపథ్యంలో ఆయన హాకీ ఇండియా అధ్యక్ష పదవిని త్యజించాల్సి ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిన సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరిగింది. ప్రతీ జాతీయ సంఘానికి చెందిన ప్రతినిధికి ట్యాబ్లెట్‌తో పాటు పాస్వర్డ్ కేటారుుంచగా తమకు ఇష్టమైన అభ్యర్థిని వారు ఎన్నుకున్నారు.
ఈ ఫలితాలను అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న లియాండ్రో నెగ్రే వెల్లడించారు. బాత్రా విజయంతో ప్రపంచ హాకీపై గుత్తాధిపత్యం యూరప్ నుంచి ఆసియాకు మారినట్టరుు్యంది. 2014 అక్టోబర్‌లో హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికై న బాత్రా.. ఎఫ్ఐహెచ్ అత్యున్నత పదవి కోసం గత కొన్ని వారాలుగా అనుబంధ దేశాలకు చెందిన సంఘాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన హాకీ ఈవెంట్స్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ చురుగ్గా ఉండేవారు. దీంతో సహజంగానే అందరి మొగ్గు బాత్రా వైపు నెలకొంది.
హాకీ అభివృద్ధికి విశేష కృషి
1957, ఏప్రిల్ 18న జన్మించిన నరీందర్ బాత్రా ప్రముఖ పారిశ్రామిక వేత్త. 2009లో తొలిసారిగా ఆయన హెచ్‌ఐలో కోశాధికారిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి చురుకై న ఆఫీస్ బేరర్‌గా అందరి దృష్టిలో పడ్డారు. దీంతో ఏడాది అనంతరం ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. అనంతరం దేశంలో హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. హాకీ అభివృద్ధిపై అంకితభావంతో ముందుకెళ్లి గత ఆరేళ్లలో హాకీ ఆదాయాన్ని 5 లక్షల డాలర్ల నుంచి కోటీ 41 వేల డాలర్లకు పెంచారు. ఐపీఎల్ తరహాలోనే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు రూపకల్పన చేసి ఆటగాళ్లతో పాటు హెచ్ఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. అలాగే 2014 నుంచి హెచ్ఐ అధ్యక్షుడిగా ఉన్న బాత్రా పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌ను భారత్‌కు రప్పించారు.
‘హాకీని విశ్వవ్యాప్తం చేస్తా’
‘ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవి నాకు దక్కిన గొప్ప గౌరవం. హాకీని అమితంగా ఇష్టపడే నేను ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ ఎంత వరకు చేరింది.. ఎంత ఆర్జించింది అనే లెక్కలపైనే నడుస్తోంది. హాకీకున్న హద్దులను చెరిపేసి మరింత విస్తరించడంపైనే నేను దృష్టి పెడతా. అప్పుడు ఈ ఆటను 10, 12 దేశాలకే పరిమితం కాకుండా విస్తరించవచ్చు. అమెరికా, చైనా, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నారుు. అలాగే ఈ క్రీడకు కూడా ఈ మూడు దేశాలు మంచి మార్కెట్‌గా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఇక్కడ హాకీని పాపులర్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందవచ్చు’
- అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా