Holiday Packages
-
#HYD Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది. కాగా, హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు. BREAKING: #Hyderabad Metro Rail officials took a crucial decision due to the increase in traffic. 10% discount on metro card along with Rs.59 holiday card has been cancelled. On the other hand, the demand for metro travel has increased with the intensity of the summer. — Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) April 7, 2024 మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదేవిధానాన్ని అమలుచేస్తున్నారు. -
ఆ విమానాల చార్జీలు రెట్టింపు!
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రిటిష్ ట్రావెల్ ఏజెన్సీ థామస్ కుక్ అనూహ్యంగా దివాలా తీయడంలో లండన్‌కు చెందిన దాదాపు 1,60,000 మంది ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వారంతా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. వారంతా ‘హాలీడే ప్యాకేజీ’ కింద థామస్ కుక్ కంపెనీకి ముందుగానే డబ్బులు చెల్లించడంతో చేతిలో అదనపు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్లేందుకు తిప్పలు తప్పడం లేదు. థామస్ కుక్ దివాలా కారణంగా ఆ సంస్థ బుక్ చేసిన విమానయాన టిక్కెట్లు, హోటళ్లలో బసలు అన్నీ రద్దయిపోయాయి. ఇదే అదనుగా జెట్, టూయీ లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికుల అవసరాన్ని దోచుకుంటున్నాయి. ఆ సంస్థలు విమానయాన చార్జీలను సోమవారం నాటి నుంచి అనూహ్యంగా రెట్టింపు చేశాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లు హాలీ డే ప్యాకేజీలను కూడా రెట్టింపు చేశాయట. ‘డిమాండ్–సరఫరా’ ఆర్థిక సూత్రాన్ని బట్టే తాము చార్జీలను వసూలు చేస్తున్నామని, లేకపోతే తక్కువ రేట్లకు టిక్కెట్లను మంజూరు చేసి ‘థామస్ కుక్’ సంస్థ లాగా దివాలా తీయాలా! అని జెట్ 2 విమానయాన సంస్థ ప్రతినిధ ఒకరు వ్యాఖ్యానించారు. తమ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఇటు విమానయాన సంస్థలు, అటు హోటళ్లు గద్దల్లా దోచుకుంటున్నాయని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తాము వచ్చేటప్పుడు 250 పౌండ్లకు, రిటర్న్ టిక్కెట్‌ను 260 పౌండ్లకు బుక్ చేసుకోగా, ఇప్పుడు జెట్ 2లో రిటర్న్ టిక్కెట్ 413 పౌండ్లకు పెంచారని టర్కీలోని దలామన్లో ఓ ప్రయాణికుడు వాపోయారు. విమానం టిక్కెట్ కింద తమ నుంచి థామస్ ఒక్కరికి 317 పౌండ్లను వసూలు చేయగా, ఇప్పుడు అదే టిక్కెట్ ధరను వర్జిన్ ఐలాండ్ విమానయాన సంస్థ 570 పౌండ్లకు పెంచిందని మరో ప్రయాణికుల కుటుంబం ఆరోపించింది. 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కుక్ కథ సోమవారం ముగిసిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకున్న 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పరోక్షంగా మరెంతో మంది ఉపాధి కోల్పోయారు. -
దుస్తులకూ బజాజ్ ఈఎంఐ కార్డు
బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ హెడ్ సంజీవ్ మఘె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్ మొదలైన వాటికే పరిమితమైన ఈఎంఐ నెట్వర్క్ కార్డును తాజాగా దుస్తులు, హాలిడే ప్యాకేజీలు, చిన్న ఉపకరణాలు వాటి కొనుగోలుకు కూడా వర్తింపచేస్తున్నట్లు బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ హెడ్ (ఈఎంఐ కార్డుల విభాగం) సంజీవ్ మఘె తెలిపారు. ఇందుకోసం కనీస ఇన్వాయిస్ మొత్తం రూ. 5,000గా ఉంటుందని గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, పుణే, బరోడా నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టామని, త్వరలో మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి తేనున్నామని వివరించారు. దీనికోసం హైదరాబాద్‌లో 25 బ్రాండ్స్, 100 పైగా స్టోర్స్‌తో చేతులు కలిపినట్లు సంజీవ్ చెప్పారు. మూడు నగరాల్లో మొత్తం 300 పైగా స్టోర్స్‌తో భాగస్వామ్యం ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 50 వేల అవుట్‌లెట్స్‌కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆయా స్టోర్స్‌లో దుస్తులు, ఐ వేర్ లాంటి ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కార్డును స్వైప్ చేసి, ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చని చెప్పారు. కోచింగ్ క్లాస్‌లకు కూడా దీన్ని విస్తరించే యోచనలో ఉన్నట్లు సంజీవ్ పేర్కొన్నారు. హాలిడే ప్యాకేజీల కోసం కాక్స్ అండ్ కింగ్స్‌తో టైఅప్ పెట్టుకోగా, నిర్దిష్ట ఉత్పత్తుల కోసం ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కూడా చేతులు కలిపినట్లు వివరించారు. డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు అయిదో వంతు బజాజ్ ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నాయని సంజీవ్ పేర్కొన్నారు.