వైఎస్సార్‌కు పిండ ప్రదానం
అచ్చంపేట: మండలంలోని కస్తల పుష్కర ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం పిండప్రదానం చేశారు. ఘాట్‌లో స్నానం చేసి తల్లిదండ్రులు, గురువులు, పితృ సమానులైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశానన్నారు. కస్తల ఘాట్‌లో నీరు స్వచ్ఛంగా ఉన్నాయని, రద్దీ తక్కువగా ఉంటుందని తెలిసి వచ్చానన్నారు. అనంతరం ఆయన శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గ్రామపార్టీ కన్వీనర్ చెన్నమల్లు రవి, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జాన్‌పీరా, వైఎస్సార్ సీపి అభిమానులు ఉన్నారు.