hoogly
-
భారత్‌లో ఫస్ట్ టైం.. నది కింద నుంచి మెట్రో పరుగులు
ఢిల్లీ: రైల్వే ప్రయాణంలో కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. నది కింద భాగం నుంచి మెట్రో రైలు పరుగులు తీయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. తద్వారా మన దేశంలోనే తొలిసారిగా ఇలాంటి అనుభూతిని ప్రయాణికులకు అందించబోతోంది. హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. బుధవారం టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తైంది. ఈ ఫీట్‌ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. అయితే ట్రయల్ రన్స్ మొదలుపెట్టి ఏడునెలలపాటు కొనసాగిస్తామని.. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్‌కతా. Kolkata Metro creates History!For the first time in India,a Metro rake ran under any river today!Regular trial runs from #HowrahMaidan to #Esplanade will start very soon. Shri P Uday Kumar Reddy,General Manager has described this run as a historic moment for the city of #Kolkata. pic.twitter.com/sA4Kqdvf0v — Metro Rail Kolkata (@metrorailwaykol) April 12, 2023 -
ఫిష్ బట్టర్ కర్రీ, చిల్లీ ఫిష్.. అబ్బ నోరూరుతోంది.. బిర్యానీ కూడా!
కోల్‌కతా: పెళ్లంటే.. పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఆటపాటలు.. మరదళ్ల చిలిపి చేష్టలు.. బావమరుదుల సరదాలు.. బంధువుల సందడి.. బంతి భోజనాలు, నూరేళ్ల పాటు చల్లగా ఉండమంటూ వధూవరులను ఆశీర్వదిస్తూ అతిథులు ఇచ్చే దీవెనలు.. అబ్బో చెప్తూ పోతే లిస్టు కాస్త పెద్దగానే ఉంటుంది. రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలను పెనవేసే వివాహ వ్యవస్థకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం అలాంటిది. అయితే, మహమ్మారి కరోనా కారణంగా ఇటీవలి కాలంలో ఈ సందడి కాస్త తగ్గిందనే చెప్పాలి. కోవిడ్ నిబంధనల నడుమ, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిపించాల్సి వస్తోంది. ఇక భోజనం సంగతి సరేసరి. కరోనా కాలంలో వర్చువల్ పెళ్లిళ్లతో పాటు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లతో అతిథులకు భోజనాలు పంపే ట్రెండ్ కూడా ఈ మధ్య కనిపిస్తోంది. ఎన్ని వెరైటీలు పెట్టినా... పెళ్లిలో మనవాళ్లతో కలిసి కూర్చుని తింటే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వెడ్డింగ్ మెనూ కార్డు నెటిజన్లను ఆకర్షిస్తోంది. బెంగాళీల ఇంట 90వ దశకంలో జరిగిన పెళ్లిలో వడ్డించిన వంటకాలు చూసి.. ‘‘ఆ రోజులే వేరు’’అంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. ‘‘ఓ మై గాడ్... మా తల్లిదండ్రుల వెడ్డింగ్ రిసెప్షన్ మెనూ కార్డును మా కజిన్ వెలికితీశాడు’’అంటూ ఓ ట్విటర్ యూజర్ దీనిని షేర్ చేశారు. ఇందులో... ‘‘శాకాహారులకు... రాధాబ్లావీ, దమ్ ఆలూ, వెజిటబుల్ కట్లెట్, మోటార్ పన్నీర్, చట్నీ, పాపడ్, కమలాభోగ్, ఐస్‌క్రీం... నాన్ వెజ్ తినేవారికి... ఫిష్ బట్టర్ కర్రీ, చిల్లీ ఫిష్, చికెన్ రెజాలా’’ వంటి వెరైటీలు వడ్డిస్తామని పేర్కొన్నారు. ఇక కార్డు చూసిన భోజన ప్రియులు.. ‘‘జాబితా చూస్తుంటేనే నోరూరుతోంది.. బిర్యానీ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. నా పెళ్లిలో మా సంస్కృతికి తగ్గట్లు స్పెషల్స్ వండిస్తా’’ అంటూ రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. -
ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్’ అనక తప్పదు
కలకత్తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడు విడతల పోలింగ్ ముగియగా ఐదు దశ పోలింగ్ ఉండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఇంకా హాట్‌హాట్‌గా ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు బెంగాల్‌పైనే ప్రధాన దృష్టి సారించాయి. ఈ క్రమంలో తాజాగా గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నాడు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాడు. మే 2వ తర్వాత మమతా బెనర్జీ ‘జై శ్రీరామ్’ అనక తప్పదని స్పష్టం చేశాడు. ఆ విధంగా అనిపిస్తామని పేర్కొన్నాడు. ఎన్నికల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘హిందూత్వ రాజకీయం’ అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలపై స్పందన యోగి ఆదిత్యనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. హుగ్లీ జిల్లా కృష్ణరామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలోభాయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రోమియోలను కటకటాల పాలవుతారని తెలిపారు. సీఏఏ ఉద్యమానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి ఓటు బ్యాంక్ కోసం వెంపర్లాడుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 9వ తేదీకి ఆఖరి దశ పోలింగ్ ఉంది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. -
అమ్మాయిపై వెకిలి చేష్టలు
-
అమ్మాయిపై వెకిలి చేష్టలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. ఓ అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హూగ్లీ జిల్లా చిన్సూరా నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు తిలకిస్తున్న ఆమె వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వెకిలి చేష్టలకు దిగాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని గమనించకపోగా, పక్కనే ఉన్న మహిళ గుర్తించి ఆమెను పక్కకు లాగింది. తనను గమనిస్తున్నారన్న విషయం అర్థమైన ఆ వ్యక్తి.. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఘటన ఎప్పుడు జరిగింది? వీడియో ఎవరు తీశారన్న అంశాలపై స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా, విషయం మీడియా ఛానెళ్లకు పాకింది. నిందితుడి గుర్తించిన వారు తమకు సమాచారం ఇవ్వాలంటూ హూగ్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రాణం పోతున్నా.. క్యూ లైన్లోనే!
-
ప్రాణం పోతున్నా..
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. సాధారణ అవసరాలకు సైతం చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుల సమయం గంటల కొద్ది క్యూ లైన్లలోనే గడిచిపోతుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఏటీఎం క్యూ లైన్లో నిలుచున్న ఓ 52 ఏళ్ల వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. చాలా సమయం లైన్లో నిలుచున్న అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. బాధతో విలవిలలాడుతున్నా అతడితో పాటు లైన్లో ఉన్నవాళ్లు చూసీచూడనట్లుగా వదిలేసి.. డబ్బుకోసం ముందుకు కదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని 80 శాతం ఏటీఎంలలో కొత్త నోట్లు ఉంచడానికి అవసరమైన మార్పులు చేశాం అని అధికారులు చెబుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడ చూసినా మూసివేసిన, నో క్యాష్ బోర్డులు ఉంచిన ఏటీఎంలే కనిపిస్తున్నాయి. డబ్బు ఉన్న కొద్దిపాటి ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు.