రెండు ఆత్మల పగ
ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ చిత్రాలకే పరిమితమవుతున్న రాయ్ లక్ష్మి ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ఓ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘శివ గంగ’ దసరాకి విడుదల కానుంది. రెండు ఆత్మలు పగ తీర్చుకునే కథాంశంతో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది.
కుమార్‌బాబు సమర్పణలో వీసీ ఉదయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్ ముఖ్యతారలు. కుమార్‌బాబు మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. రాయ్ లక్ష్మి గ్లామర్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. 37 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.