hosptial
-
స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన బంధువులు
-
వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
-
అలంపూర్ లో ఆసుపత్రి కోసం ఆందోళన
-
ఎలుకల కోసం రూ.8.4 కోట్లు
సాక్షి, అమరావతి: రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్లుగా ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ ముఖ్యనేతకు దగ్గరి బంధువు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ చెల్లించారు. టీడీపీ ముఖ్యనేతకు ఈ కాంట్రాక్టర్ సమీప బంధువు కావడం గమనార్హం. పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ పేరుతో పని చేయకపోయినా కాంట్రాక్టర్‌కు భారీ లబ్ధి చేకూరుస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. నెలకు రూ.70 లక్షలు... రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, కీటకాల నియంత్రణ, సెక్యూరిటీ సర్వీసులు గతంలో ఒకే కాంట్రాక్టరు కింద ఉండేవి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన ఘటన అనంతరం పారిశుధ్యం నుంచి కీటకాల నియంత్రణను తొలగించారు. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. కీటకాల నియంత్రణకు సగటున రూ.70 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.8.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు, పాములు యధేచ్ఛగా సంచరిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో ఆస్పత్రిలో నలుగురు సిబ్బందితో తూతూమంత్రంగా నీళ్ల మందు పిచికారీ చేస్తూ కీటకాలను నియంత్రించినట్లు నెలవారీ బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, విశాఖపట్నం ఆస్పత్రుల్లో నెలకు రూ.7 లక్షలకు పైగా చెల్లిస్తున్నా కనీసం పది ఎలుకలను కూడా పట్టడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్లలోకి ఎలుకలు చొరబడుతుండటంతో రోగులు హడలిపోతున్నారు. -
పని బాట..కన్నీటి మూట
త్వరలో తిరునాల. పండగలా చేసుకోవాలి. బంధువులను పిలుచుకోవాలి. నాలుగు రాళ్లు చేతిలో ఉంటే మేలు. ఊర్ల పనుల్లేవు. పక్క ఊర్లకైనా ఎల్లాల అనుకుంటుండగా.. గని గ్రామంలో మిరప పండు తెంచేందుకు పని దొరికింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామానికి చెందిన 36 మంది శుక్రవారం ఉదయమే ట్రాక్టర్లో పయనమైనారు. కొంత దూరం పోయినాక ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు మహిళలు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకునే లోపు మరణించారు. తెల్లారితే మహిళా దినోత్సవం. ప్రపంచమంతా ఆ ఏర్పాట్లలో ఉండగా.. బతుకు బాటలో ముగ్గురు మహిళలు మృత్యువొడి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు సర్వజన వైద్యశాల క్యాజువాలిటీ శుక్రవారం ఉదయం క్షతగాత్రులతో కిక్కిరిసింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన వారితో ఆసుపత్రి నిండిపోయింది. క్యాజు వాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యం లో జూనియర్ వైద్యులు, నర్సులు క్షతగాత్రులకు వైద్యం ప్రారంభించారు. పడకలు సరిపోకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరిచొప్పున వైద్యం చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాజువాలిటీలో క్షతగాత్రుల ఆర్థనాదాలు మిన్నంటాయి. క్షతగాత్రులను పరామర్శించిన గౌరు దంపతులు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి పరామర్శించారు. బాధితులంతా నిరుపేదలే కావడంతో ఆదుకోవాలని అధికారులను కోరారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకులు కేజే రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
సిరిపురం (రామన్నపేట), న్యూస్‌లైన్: వివాహిత యువకుడి వేధిం పులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సిరిపురం గ్రామం లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంజి శ్రీజ(20)ను అదేగ్రామానికి చెందిన మన్సూర్ (28) అనే వివాహితుడు పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా వేధిం చసాగాడు. పలుమార్లు అమ్మాయి తల్లిదండ్రులు పెద్దమనుషుల సమక్షంలో మందలించారు. ఇటీవల శ్రీజకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభిం చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పదిన్నర గంటలకు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చేస్తే ఊరుకోనని బెదిరిం చాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీజ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో రంగుల అద్దకానికి ఉపయోగించే నైటాప్ అనే రసాయాన్ని సేవించింది. కుటుంబసభ్యులు 108 వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొం దుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వై.హరిబాబు తెలిపారు. రెండేళ్ల క్రితమే మన్సూర్‌కు వివాహం జరిగింది. అతడు సుమో డ్రైవర్.