గిబ్సన్ త్రూ లెన్స్
ప్రపంచ ప్రఖ్యాత గిటార్ వాయిద్యకారుల సంగీత కచ్చేరీల అపురూప ఫొటోలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. గిటార్ వాయిద్య పరికరాల తయారీ సంస్థ ‘గిబ్సన్’ 120వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిబ్సన్ త్రూ లెన్స్’ నాటి స్మృతులను కళ్లముందు ఉంచింది.
బేగంపేట్ హోటల్ తాజ్ వివంతాలో గురువారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్లో ప్రఖ్యాత గిటారిస్టులు జిమ్మి హెన్రిక్స్, మడోనా, ఫ్రాంక్జప్పా, ఎల్విస్, పాల్ మెక్కట్నీ, బాన్జోవీ, జాక్వైట్ తదితరులు గిటార్ ప్లే చేస్తున్న చిత్రాలు ఇందులో కనువిందు చేస్తున్నాయి. ఈ నెల 12 వరకు ప్రదర్శన ఉంటుంది. ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులు గిటార్ ప్లే చేసి అలరించారు.