ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
‘వైష్ణవి’ ప్రారంభోత్సవంలో మంత్రి చందూలాల్
కాజీపేట : అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లో ఉండే ధరలతో నాణ్యమైన సేవలందిస్తే వ్యాపారంలో రాణించడంతో పాటు గుర్తింపు పొందొచ్చని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమా కాంప్లెక్స్‌లో బైరి రవికృష్ణ, హరికృష్ణ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ‘హోటల్ వైష్ణవి గ్రాండ్’ రెస్టారెంట్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ వరంగల్ స్మార్ట్‌సిటీగా ఎదుగుతున్న తరుణంలో అత్యున్నత ప్రమాణాలతో రెస్టారెంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మేయర్ నరేందర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటిస్తే వ్యాపారం సజావుగా సాగుతుందన్నా రు. ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకటనారయణ, జిల్లా అధ్యక్షుడు బోనగాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.