వెల్లువెత్తిన ప్రజాగ్రహం
ఇంటి పన్నుల భారీ పెంపుపై రాజానగరం
నియోజకవర్గంలో నిరసనలు
పంచాయతీల వద్ద నిరాహార దీక్షలు
ప్రజల బాగు పట్టని ప్రభుత్వమంటూ విమర్శలు
రాజానగరం :
భారీగా పెంచిన ఇంటి పన్నుల విధానాన్ని నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గంలోని 62 పంచాయతీల వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలు చేపట్టారు. కోరుకొండ మండలంలో ఆ పార్టీ నియోజకవర్గ కోఆరి్డనేటర్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజానగరం మండలంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సీతానగరం మండలంలో యువనాయకుడు జక్కంపూడి గణేష్ పర్యవేక్షించారు. వారితోపాటు పెద్దాపురం, రాజమహేంద్రవరం రూరల్ కోఆరి్డనేటర్లు తోట సుబ్బారావునాయుడు, ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సభ్యుడు అయ్యప్పచౌదరి, మైనార్టీ సెల్ ప్రతినిధి నాయీభాయ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, నాసా రాంజీలు నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి పన్నులను ఒకేసారి భారీగా పెంచడాన్ని వారు తీవ్ర తప్పిదంగా పేర్కొన్నారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ సర్పంచ్ మెట్ల ఏసుపాదం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రారంభించి, నియోజకవర్గంలో ఇంటి పన్నుల పెంపుపై ప్రజా నిరసనలకు శ్రీకారం చుట్టారు. అనంతరం దివా¯ŒSచెరువులో దేశాల శ్రీను, శ్రీకృష్ణపట్నంలో మండల కన్వీనర్ మండారపు వీర్రాజు,
భూపాలపట్నంలో సొసైటీ అధ్యక్షుడు పేపకాయల విష్ణుమూర్తి, తోకాడ, ఫరిజ
లి్లపేటలలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఉండమట్ల రాజబాబు, గండి నానిబాబు, సంపత్నగరంలో ఎంపీటీసీ సభ్యుడు లంక అమ్మిరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, జక్కంపూడి జగపతి, వాడ్రేవు శ్రీనివాసకుమార్ ముక్కినాడ, వెలుగుబందలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. గాదరాడలో మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలెం నాగవిష్ణుల ఆధ్వర్యంలో పంచాయతీకి సమీపంలో నిలువెత్తు గొయ్యి తీసి దానిలో నిలబడి నిరసనను తెలియజేశారు. జంబూపట్నంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, సర్పంచ్ నాగ సత్తిబాబు, ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు.
సీతానగరంలో మండల కన్వీనర్ డాక్టర్ బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎంపీటీసీ సభ్యుడు కోండ్రపు ముత్యాలు, పురుషోత్తపట్నంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చలమల్ల సుజీరాజు, ఎంపీటీసీ సభ్యుడు చలమల రమాదేవి, కూనవరంలో సర్పంచ్ అబ్బులు, ఎంపీటీసీ సభ్యుడు ఏసు, ముగ్గళ్లలో సర్పంచ్ కుమారుడు బొమ్ముల రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గెడ్డం కృష్ణ, మండల సేవాదళ్ అధ్యక్షుడు ఆళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిగాయి. కోరుకొండలో పార్టీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబులు జిల్లా కార్యదర్శి చింతపల్లి చంద్ర, రాష్ట్ర యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొరుసు భద్రి, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, వాకా నరసింహరావు, తదితరులు ర్యాలీ చేసి, తహసీల్దారు, ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు.
నాడు ప్రజారంజకం – నేడు దారి దోపిడీ
రాష్ట్రంలో ప్రజలు గత 13 సంవత్సరాల కాలంలో రెండు రకాల ప్రభుత్వాలను చూశారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఒకటి ప్రజారంజకమైనది అయితే, రెండోది దారి దోపిడీ ప్రభుత్వమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవన్నారు. రుణమాఫీతోపాటు ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ సీఎంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రజారంజకమైన పాలనతో నేటికీ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందారన్నారు. అయితే నేడు అధికారంలో ఉన్న చంద్రబాబుకు రాజధాని, సొంతింటి నిర్మాణాలు, కుమారుడికి రాజ్యాధికారం కట్టబెట్టడం వంటి పనులు తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. దారిదోపిడీ మాదిరిగా ప్రజలపై పన్నుల భారం వేస్తూ ధనార్జనే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజలపై మోపిన ఇంటి పన్నుల భారం గ్రేటర్ హైదరాబాదులో కూడా లేదన్నారు. పూరి గుడిసెకు కూడా ఇక్కడ రూ.వెయ్యి పైబడి ఇంటి పన్ను ఉంటే అక్కడ పక్కా ఇంటికి కూడా అంతటి పన్ను ఉండదన్నారు. ఈ కారణంగానే ప్రజలు తిరుగుబాటు ప్రకటించారని, ఇది ప్రారం¿¶ ం మాత్రమేనని, ఉపేక్షిస్తే ప్రభుత్వ పునాదులు కూడా కదలక తప్పదని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.