ఒడిశా రైలు ప్రమాదం: ‘లడ్డూ గోపాలుడే నన్ను కాపాడాడు’
‘భూమిపై ఇంకా నూకలున్నాయి’ ఈ నానుడి ఒడిశా రైలు దుర్ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నవారిని చూస్తే నూటికి నూరుశాతం నిజం అనిపిస్తుంది. ఒక మహిళా ప్రయాణికురాలి విషయంలో అదే జరిగింది. నిజానికి ఆమె కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయాల్సివుంది. అయితే చివరి నిముషంలో ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మహిళ తన కథను వినిపించడంతో పాటు తనను లడ్డూ గోపాలుడు (శ్రీకృష్ణుడు) కాపాడానని కనిపించినవారందరికీ చెబుతున్నారు.
మీడియాతో లక్ష్మీదాస్ సర్కార్ అనే మహిళ మాట్లాడుతూ తాను మిగిలిన ప్రయాణికుల మాదిరిగానే జూన్ 2న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సివుందన్నారు. అయితే తన కుమార్తెకు ఏదో పని ఉండటం వలన ప్రయాణం రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆమె లడ్డూ గోపాలుని విగ్రహాన్ని భక్తితో చేతుల్లోకి తీసుకుని, భగవంతునికి ధన్యవాదాలు తెలిపారు. లడ్డూ గోపాలుని దయ వలనే తాను ప్రాణాలతో ఉన్నానని పేర్కొన్నారు.
హౌరాకు చెందిన లక్ష్మీదాస్ సర్కార్ జూన్ 2న షాలిమార్ నుంచి చెన్నై వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఆమె చెన్నైలోని తన కుమార్తెను చూసేందుకు వెళ్లాలనుకున్నారు. ఆమె కుమార్తె ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే కుమార్తెకు ఏదో పని ఉన్న కారణంగా లక్ష్మీదాస్ సర్కార్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని, తరువాత ఎప్పుడైనా వెళ్లవచ్చని నిర్ణయించుకున్నారు. అయితే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె భగవంతుడే తన ప్రాణాలు కాపాడాడని చెబుతున్నారు.
చదవండి: కుమారుని మృతదేహం మాయం.. కంగుతిన్న తండ్రి!