HT Leadership Conference
-
ప్రజలే చేస్తున్న అభివృద్ధి ఇది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పలు పథకాలు తీసుకొచ్చాయని మేం మాత్రం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అసమానతలు పెరిగిపోతున్నాయి ‘‘ప్రజాప్రగతి కోసం ప్రజలే స్వయంగా పాటుపడుతున్నారు. మేం ఆ ప్రజాయజ్ఞం దిగి్వజయం కావడానికి కృషిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పథకాలు తీసుకొచ్చాయి. దీంతో ఆ ప్రభుత్వాలు సమాజంలో అసమానతలకు హేతువులయ్యాయి. దీంతో నేడు సామాజిక తులాభారంలో అసమతుల్యత రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలకు మేం చాలా దూరం. మా ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ పెంపొందించింది. 90వ దశకంలో భారత్ పదేళ్లలో ఐదుసార్లు ఎన్నికలను చవిచూసింది.ఆనాడు దేశంలో ఎంతో అస్థిరత తాండవించింది. భారత్‌లో పరిస్థితులు ఇకమీదట ఎప్పుడూ ఇలాగే ఉంటాయని రాజకీయ పండితులూ తరచూ విశ్లేషణలు చూసేవారు. ఇప్పుడు చాలా దేశాల్లో అంతర్యుద్ధం, ఆర్థికసంక్షోభం, అస్థిరత రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ భారతీయ ఓటర్లు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశం ఇచ్చారు. ప్రజల కోసం భారీగా ఖర్చుపెట్టాలి. ప్రజల కోసం భారీగా ఆదాచేయాలి. ఈ శతాబ్దిని భారతీయ శతాబ్దిగా అందరూ గుర్తుంచుకుంటారు’’అని మోదీ అన్నారు. హిందుస్తాన్ టైమ్స్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మోదీ స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. రిస్క్ చేసే సంస్కృతిని పోగొట్టారు సవాళ్లను భారత్ ఎదుర్కొంటున్న తీరుపై మోదీ స్పందించారు. ‘‘మన ముందుతరాల వాళ్లు సవాళ్లను స్వీకరించారు. రిస్క్ తీసుకోవడం వల్లే మనం ఇప్పుడు మన వస్తు, సేవలను విదేశాలకూ అందించగల్గుతున్నాం. దాంతోపాటే వాణిజ్యం, సంస్కృతికి భారత్ కేంద్రంగా పరిఢవిల్లింది. అయితే భారత స్వాతం్రత్యానంతరం ఈ రిస్క్ తీసుకునే సుగుణాన్ని గత ప్రభుత్వాలు కోల్పోయాయి. మా హయాంలో గత పదేళ్లుగా భారత్ మళ్లీ రిస్క్ తీసుకోవడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలను అందిస్తోంది’’అని అన్నారు. నాడు భయపెట్టి ఇప్పుడదే భయపడుతోంది ‘‘ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో పాత దినపత్రికలను చదివా. 1947 అక్టోబర్‌లో జమ్మూకశీ్మర్ భారత్‌లో విలీనంవేళ భారతీయుల ఆనందం వార్త చదివి నేను కూడా అంతేస్థాయిలో పరమానందభరితుడినయ్యా. అయితే గత ప్రభుత్వాల కారణంగా ప్రజలను ఉగ్రవాదం భ యపెట్టేది. పొరుగుదేశాల సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతీయులు సొంత ఇళ్లు, నగరాల్లోనూ ఉండటానికి జంకారు. ప్రభుత్వాల నిర్ణయాత్మకంగా వ్యవహరించపోవడం వల్ల ఏడుదశాబ్దాల పాటు కశ్మీర్ హింసను చవిచూసింది. ఇప్పుడు కాలం మారింది. మా ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాదం దాని సొంత దేశం(పాకిస్తాన్)లో కూడా భయపడుతోంది. ఇప్పుడు కశ్మీర్లో కూడా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదవుతోందని ఈనాటి పత్రికల్లో వస్తోంది’’అని అన్నారు. -
ఏపీతో పోటీపడేవారెవ్వరూ లేరు
-
ఏపీతో పోటీపడేవారెవ్వరూ లేరు
’అనంత’ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. రూ. 500, వెరుు్యనోట్ల రద్దుతో ఆర్థిక సమస్య తలెత్తుతోంది. అరుునప్పటికీ మనతో పోటీపడేందుకు దేశంలో మరెవ్వరూ లేరు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుఅన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండోదశలో భాగంగా నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌కు శుక్రవారం నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించిన తర్వాత మడకశిరలో ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలపై 7, 8 తేదీల్లో భేటీ డిజిటల్ లావాదేవీలపై జాతీయ స్థారుులో ఏర్పాటైన కమిటీ సమావేశం 7, 8 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో ఆయన పెద్దనోట్ల రద్దు పరిణామాలపై బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల అమలులో ఎదురవుతున్న సవాళ్లపై సభ్యులతో సమాలోచనలు జరుపుతామని చెప్పారు. ‘నగదురహిత’కు రూ.100 కోట్లు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు రహిత లావాదేవీలను తక్షణం అమల్లోకి తేవాలని బాబు నిర్ణరుుంచారు. ఇందులో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఏకంగా రూ.100 కోట్లు వ్యయం చేయాలని నిర్ణరుుంచారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణరుుంచారు. నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి శుక్రవారం బ్యాంకర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స నిర్వహించారు. గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను చేరుుంచేవారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలని నిర్ణరుుంచారు. మరోవైపు నగదురహిత లావాదేవీల ప్రోత్సాహక పథకం పచ్చ చొక్కాలకేనని అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌టీ లీడర్షిప్ సదస్సుకు బాబు న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ప్రారంభంకానున్న హెచ్‌టీ 14వ లీడర్ షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సమాచార శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ’భారత్‌కు కావాల్సిన మార్పులు’ థీంతో నిర్వహించే ఈ సదస్సులో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరున్, కేంద్ర మంత్రులు ఆరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, పియూష్ గోయల్, క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ టెండుల్కర్, ప్రముఖ నటుడు అమితాబచ్చన్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు.