కలిదిండిలో నకిలీ నోట్ల కలకలం
కైకలూరు : కొల్లేరు తీరంలో నకిలీ నోట్ల చలామణి అంశం మరోసారి తెరపైకొచ్చింది. రెండేళ్లు స్తబ్ధతగా ఉన్న ముఠా తిరిగి తన కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. జిల్లా సరిహద్దు మండలాల్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2014 జులై 24న కలిదిండి మండలం అమరావతికి చెందిన ప్రధాన సూత్రదారి జలసూత్రం వెంకన్న నుంచి రూ.51వేల నకిలీ నోట్లును పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తిరిగి నకిలీ నోట్ల చలామణికి రంగం సిద్ధం చేస్తున్నారనే వాదన బలంగా ఉంది. మండలంలోని తాడినాడ, పోతుమర్రు, వెంకటాపురం గ్రామాల్లో కొందరు నకిలీ నోట్లును గుట్టుగా దాచినట్లు సమాచారం. గతంలో పట్టుబడ్డ ప్రధాన సూత్రదారి జలసుత్రం వెంకన్న వెంకటాపురం గ్రామంలోని ఓ ఇంటిలో రూ.100, రూ.500 నోట్లు తయారు చేయానికి కలర్ ఫ్రింటర్, తెల్ల నోటు కాగితాలను సిద్ధం చేసుకోవడం గుర్తించిన పోలీసులు వాటని స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా ఓ వ్యక్తి నకిలీ నోట్లు సిద్ధంగా ఉన్నాయంటూ, ఇప్పుడు తీసుకోపోతే తిరిగి వెనక్కి Ðð ళ్ళిపోతాయి అని కొందరితో చెబుతున్నట్లు తెలిసింది.
కొల్లేరు ప్రాంతంపై కన్ను...
కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపల, రొయ్యిల చెరువులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని నకిలీ కరెన్సీ ముఠా అనుకూల ప్రాంతంగా మలుచుకుంటుంది. ఆక్వా పరిశ్రమ ద్వారా ప్రతి రోజు ఇక్కడ కోట్లలో నగదు బట్వాడ జరుగుతుంది. ముఠా సభ్యులు కొందరిని ఈ ఉచ్చులోకి దించుతున్నారు. నకిలీ డబ్బు ఆశిస్తున్నా వ్యక్తి ఎదురుగా నకిలీ నోటుతో దుకాణాల్లో వస్తువు కొంటున్నారు. నమ్మకం కలిగిన సదరు వ్యక్తులు వీరి వద్ద నుంచి నకిలీ నోట్లు తీసుకుంటున్నారు. గతంలో కైకలూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు అందించిన రూ. 500, రూ. 100 నోట్లు నకిలీవి వచ్చినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. కొందరికి నకిలీ నోట్లు తెలియక వస్తున్నా పోలీసులకు చెబితే ఆరాలు తీస్తారని వాటిని చింపిపడేస్తున్నారు. పోలీసులు నకిలీ నోట్లు ముఠా ఆగడాలను ఆదిలోనే అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.