స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సన్మానం
టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను బళ్లారి జిల్లా సంఘం నేతలు సన్మానించారు. హంపీ సందర్శనకు కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన్ను శ్రీయోగి నారాయణ బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు కాండ్రా సతీష్ ఆదివారం ఉదయం కమలాపురంలోని ఓ హోటల్లో కలిసి సన్మానించారు. త్వరలో బళ్లారికి రావాలని అల్లు అర్జున్ను కోరారు. బళ్లారిలో ఆయనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నేతలు వేణుమాధవ్, మంజు, కుమార్, ప్రసాద్, గణేష్ పాల్గొన్నారు. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ, ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.