husband suicides
-
భార్యావియోగం తట్టుకోలేక..
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : భార్య వియోగంతో జీవితంపై విరక్తిచెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ బషీర్‌ఖాన్ తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్కు చెందిన బోయ కృష్ణ (35) భార్య రెండు నెలల కిందట చనిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉండేవాడు. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లి అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని అర్ధంతరంగా తనువు చాలించాడు. వీరి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తోడు లేక.. తనువు చాలించాడు!
గోరంట్ల (సోమందేపల్లి) : భార్య ఉండగా తరచూ వేధింపులకు గురి చేయడం, గొడవ పెట్టుకోవడంతో విసుగెత్తిన ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరి జీవితం అనుభవించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోరంట్ల మండలం కరావులపల్లి తండాలో గురువారం జరిగింది. తండాకు చెందిన బద్రీనాయక్(30) చీటికి మాటికీ భార్య తగవులాడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న నాయక్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కలహాలకు నిండు ప్రాణం బలి
- భర్త మృతితో భార్య మనస్తాపం - పురుగుమందు తాగి తనూ ఆత్మహత్యాయత్నం కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు చినికి చినికి గాలివానలా మారాయి. జీవితంపై విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకోగా.. మనస్తాపానికి గురైన భార్య కూడా పురుగుమందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన తాడిపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. - తాడిపత్రి టౌన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు షాషావలీ (30) కుటుంబాల కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మృతితో మనస్థాపం చెంది భార్య రమీజాబీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలోని చేనేత కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. రమీజాబీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల మేరకు పట్టణంలోని చేనేత కాలనీకి చెందిన షాషావలీకి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమీజాబీకి నాలుగేళ్ల క్రితం వివాహైంది. వీరికి కౌషర్ రెండేళ్ల పాప ఉంది. షాషావలీ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమీజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యంలో భార్యాభర్తలు ఇరువురూ తరచూ ఘర్షణ పడేవారు. రమీజా గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో షాషావలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే షాషావలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనస్థాపంతో భార్య రమీజ భర్త తాగి వదిలేసిన పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
మధురానగర్ (విజయవాడ): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడ నగరం రాజరాజేశ్వరిపేటకు చెందిన ఎస్కే బాజీ (30) స్థానికంగా బీరువాల తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఏడాది క్రితం భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు వెళ్లినా ఆమె తనతో రాకపోవటంతో బాజీ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, తనువు చాలించాడు. సింగ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.