husband tortured
-
కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు
బహదూర్‌పురా: గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంటికి రా.. అని భర్త, అత్త ఖరాఖండిగా చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురును ఈ ప్రపంచంలోకి రానివ్వడం లేదని ఈ లోకం విడిచి వెళ్లింది. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక శనివారం బలవన్మరణం పొందింది. కామాటిపురా ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన మేరకు.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్ బేగం కూతురు రుబీనా బేగం (23).. ముర్గీచౌక్ ప్రాంతానికి చెందిన అమేర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. రుబీనా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఇటీవల పుట్టింటికి పంపించారు. మళ్లీ ఆడ పిల్ల పుడితే మా ఇంటికి రావద్దంటూ భర్త, అత్త ఖరాఖండిగా చెప్పారు. మీ సామగ్రిని పంపిస్తామని తేల్చి చెప్పారు. గర్భంలో ఆడ పిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో... మగ పిల్లవాడు ఉంటేనే ఇక్కడికి రావాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్ బేగం తలుపులు పగలగొట్టి చూడగా... ఉరేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీనాజ్‌బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!) -
భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం
సాక్షి, ఖానాపూర్: భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్, ఎస్సై భవానిసేన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి చెందిన లక్ష్మి (40) భర్త బుక్య బలిరాం సోదరుడు గతంలో మృతిచెందాడు. అతడి భార్యతో బలిరాం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై భార్యతో తరుచుగా గొడవలు జరిగేవి. గ్రామస్తులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో పాటు భార్యను తరుచుగా వేధించేవాడు. శుక్రవారం ఉదయం పంటచేనుకు వెళ్లిన లక్ష్మిని అక్కడికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో పంట చేనులోని పురుగుల మందు తాగి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు వెంకటేశ్, కూతుల్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ -
అశ్లీల వీడియోలు చూస్తూ.. భార్యను లైంగికంగా..
సుల్తాన్‌బజార్: మైనర్‌ను వివాహం చేసుకుని లైంగికంగా, శారీర కంగా చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తతో పాటు మరో ఇద్దరిపై సుల్తాన్‌బజార్ పోలీసులు ఆదివారం వివిధ కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామకు చెందిన ఆకుల సృజన్ (30), నగరంలోని బడిచౌడీ కూరగాయాల మార్కెట్లో అమ్మమ్మతో నివాసముండే బాలికను (17) 2017 ఆగస్టు 17న శ్రీనగర్‌లోని ఓ ట్రస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి సృజన్ బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ వాటిలో ఉన్నట్లు సంసారం చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. ప్రతి రోజూ అనేక మార్లు లైంగికంగా వేధిస్తూ హింసించేవాడు. అభ్యంతరం తెలిపితే చిత్రహింసలకు గురిచేసేవాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భాలోలో ఫొటోలు, వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు. ప్రశ్నిస్తే వేడినీళ్లు పోసి చితకబాదేవాడు. అతని వికృత చేష్టలు మితిమీరిపోవడంతో ఐదు నెలల క్రితం భర్త ఇంటి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్దే ఉంటుంది. భర్త సృజన్ భార్యను తీసుకువెళ్లేందుకు రావడంతో తాను వెళ్లనంటూ వంటిౖపై కిరోసిన్ పోసుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు.. తనను, తన అమ్మమ్మను మభ్యపెట్టి తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకుని లైంగికంగా వేధిస్తున్న భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అమ్మమ్మతో కలిసి గత కొన్ని రోజులుగా సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో బాధితురాలు మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రతిని«ధి శీలం సరస్వతిని ఆశ్రయించడంతో ఆమె కమిషన్ ప్రతినిధులతో కలిసి సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతనను కలిసి బాలిక సమస్యను వివరించింది. వెంటనే స్పందించిన ఏసీపీ కేసు నమోదు చేయాలంటూ సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్కు అదేశాలు జారీ చేయడంతో పోలీసులు భర్త, కుటుంబ సభ్యులపై కేసును నమోదు చేశారు. మైనర్ వివాహం చేసుకున్న సృజన్ బంధువులు సుజాత, అరుణ, రవి, రాజు, దుర్గపై చైల్డ్ మ్యారెజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006, పాస్కో చట్టంతో పాటు 324, 506,420, 498(ఎ) తదితర కేసులు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
ప్రొద్దుటూరు: భర్త వేధింపులు భరించలేక ఓ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చౌడమ్మ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం దొరసానిపల్లెకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే, భర్త తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో చౌడమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.