అశ్లీల వీడియోలు చూస్తూ.. భార్యను లైంగికంగా.. | Husband Tortured Minor Wife In Hyderabad | Sakshi
Sakshi News home page

అశ్లీల వీడియోలు చూస్తూ.. భార్యను లైంగికంగా..

Published Mon, Dec 31 2018 8:32 AM | Last Updated on Mon, Dec 31 2018 9:54 AM

Husband Tortured Minor Wife In Hyderabad - Sakshi

వేడినీళ్లు పోయడంతో కాలిన చెయ్యి సృజన్‌ (ఫైల్‌ఫొటో)

సుల్తాన్‌బజార్‌:  మైనర్‌ను వివాహం చేసుకుని లైంగికంగా, శారీర కంగా చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తతో పాటు మరో ఇద్దరిపై సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఆదివారం వివిధ కేసులు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారామిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామకు చెందిన ఆకుల సృజన్‌ (30),  నగరంలోని బడిచౌడీ కూరగాయాల మార్కెట్‌లో అమ్మమ్మతో నివాసముండే బాలికను (17) 2017 ఆగస్టు 17న  శ్రీనగర్‌లోని ఓ ట్రస్టులో వివాహం  చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి  సృజన్‌ బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ వాటిలో ఉన్నట్లు సంసారం చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. ప్రతి రోజూ అనేక మార్లు లైంగికంగా వేధిస్తూ హింసించేవాడు. 

అభ్యంతరం తెలిపితే చిత్రహింసలకు గురిచేసేవాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భాలోలో ఫొటోలు, వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు. ప్రశ్నిస్తే వేడినీళ్లు పోసి చితకబాదేవాడు. అతని వికృత చేష్టలు మితిమీరిపోవడంతో ఐదు నెలల క్రితం భర్త ఇంటి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్దే ఉంటుంది. భర్త సృజన్‌ భార్యను తీసుకువెళ్లేందుకు రావడంతో తాను వెళ్లనంటూ వంటిౖపై కిరోసిన్‌ పోసుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు..
తనను, తన అమ్మమ్మను మభ్యపెట్టి తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకుని లైంగికంగా వేధిస్తున్న  భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ  అమ్మమ్మతో కలిసి గత కొన్ని రోజులుగా సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో బాధితురాలు మానవ హక్కుల కమిషన్‌ రాష్ట్ర ప్రతిని«ధి శీలం సరస్వతిని ఆశ్రయించడంతో ఆమె కమిషన్‌ ప్రతినిధులతో కలిసి సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతనను కలిసి బాలిక సమస్యను వివరించింది.

వెంటనే స్పందించిన ఏసీపీ కేసు నమోదు చేయాలంటూ సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌కు  అదేశాలు జారీ చేయడంతో  పోలీసులు భర్త, కుటుంబ సభ్యులపై కేసును నమోదు చేశారు. మైనర్‌ వివాహం చేసుకున్న సృజన్‌ బంధువులు సుజాత, అరుణ, రవి, రాజు, దుర్గపై చైల్డ్‌ మ్యారెజ్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ 2006, పాస్కో చట్టంతో పాటు 324, 506,420, 498(ఎ) తదితర కేసులు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement