hyderabad ariport
-
విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు. (చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!) భారత్‌లో ఒమిక్రాన్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్ రిపోర్ట్‌తో నవంబర్ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్ నెట్వర్క్కి పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియెంట్ అని నిర్ధారణైంది. (చదవండి: ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..) ఇక ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండో వ్యక్తి బెంగుళూరుకి చెందిన డాక్టర్. రెండు డోసులు పూర్తి అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో నవంబర్ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆస్పత్రిలో చేరారు. మూడు రోజలు తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. చదవండి: కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం -
అమెరికా ప్రవాసీ అనిల్ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డికి నవంబర్ 28 నాడు తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు, మిత్రులు స్వాగతం పలికారు. అనిల్ బోదిరెడ్డి ప్రస్తుతం 'ఆటా' వేడుకలకు కో-చైర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(GATES) చైర్‌గా, ఇండియన్ ఫ్రెండ్స్ అఫ్ అట్లాంటా చైర్‌గా సేవలందించారు. సౌత్ ఆఫ్రికాలోని గాటెంగ్‌లో 'గ్రోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(GOPIO)' కార్యదర్శి వీ లక్ష్మణ్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్(COTA)' (ప్రవాసీ తెలంగాణ సంఘాల విశ్వవేదిక) చైర్మన్ ముళ్ళపూడి వెంకట అమ్రీత్లు అనిల్ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వీసా ఆన్ ఎరైవల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో విదేశీ పర్యాటకులకు అందిస్తున్న వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని మరో నాలుగు నగరాల్లోని ఎయిర్‌పోర్టులకు విస్తరించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఆగస్టు 15 నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులలోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ సహా 11 దేశాల పర్యాటకులు ఈ సదుపాయాన్ని పొందేందుకు అర్హులని చెప్పారు.