భారీ భవనమైనా జరగాల్సిందే!
ఇది వాషింగ్టన్ డీసీలో ఓ చారిత్రక భవంతి. దీని స్థానంలో ఓ కొత్త భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో దీనిని కూల్చకుండా ఇలా పక్కకు తరలిస్తున్నారు. ఇళ్లను ఒక చోటు నుంచి మరోచోటుకు తరలించే కంపెనీకి చెందిన నిపుణుల బృందం ఈ చారిత్రక కట్టడానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా పక్కకు జరుపుతోంది.
తొలుత ఈ నిర్మాణాన్ని పునాదుల నుంచి వేరుచేశారు. అనంతరం హైడ్రాలిక్ జాక్స్ ఉపయోగించి పైకి లేపి, ఓ భారీ ట్రాలీపైకి ఎక్కించారు. తర్వాత అక్కడి నుంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మదిగా పక్కకు జరుపుతున్నారు. ఇలా ఇది గంటకు 30 మీటర్ల దూరం వెళుతోంది. చారిత్రక భవంతిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఇంత శ్రమపడుతున్నారు.