తల్లీకొడుకు అదృశ్యం
రొద్దం (పెనుకొండ) : మండలంలోని కోగిర గ్రామానికి చెందిన జ్యోతి(26), ప్రణిత్(5) అనే తల్లీకొడుకులు బుధవారం అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని ఎస్ఐ మున్నీర్ అహమ్మద్ తెలిపారు. మంగళవారం ఉదయం జ్యోతి తన కొడుకుతో పెనుకొండకు వెళ్తున్నట్లు పక్కింటి వారికి చెప్పి బయలుదేరిందన్నారు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ధర్మవరంలో ఉంటున్న జ్యోతి అన్న శశికుమార్‌కు ఫోన్లో సమాచారం తెలిపినట్లు వివరించారు. ఆయన వెంటనే తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లీబిడ్డల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.