రెండో స్థానంలో హరికృష్ణ
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్లో రాణించాడు. ఆదివారం 10 రౌండ్లు ముగిశాక హరికృష్ణ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
రికృష్ణ ఆరు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్‌లో ఓడిపోయాడు. సోమవారం మరో పది రౌండ్లు, మంగళవారం మిగతా పది రౌండ్లు జరుగుతాయి. మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 రౌండ్ల తర్వాత 4.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది.