Ian Thorpe
-
నేను ‘గే’... ఇదే నిజం
దిగ్గజ స్విమ్మర్ థోర్ప్ స్పష్టీకరణ సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ తానో స్వలింగ సంపర్కుడినని స్పష్టం చేశాడు. ఐదు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతను తన లైంగికత్వంపై ఇన్నాళ్లు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ‘బ్రిటిష్ టాక్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియా చానెల్లో ప్రసారమైంది. చాన్నాళ్లుగా ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అనే విమర్శల్ని తోసిపుచ్చిన థోర్ప్ తన హోదాకు తగినట్లు నడుచుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ‘నా కుటుంబం, నా దేశం గర్వపడాలనుకున్నాను. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చాంపియన్ ‘గే’ అనే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదనుకున్నాను. అందుకే ఎప్పటికప్పుడు ఆ విమర్శల్ని ఖండిస్తూ వచ్చాను’ అని థోర్ప్ అన్నాడు. 31 ఏళ్ల థోర్ప్ ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచాడు. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లలో థోర్ప్ 11 స్వర్ణాలు సాధించాడు. -
ఇంటెన్సివ్ కేర్‌లో థోర్ప్!
సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ 31 ఏళ్ల వయసులో తన ఎడమ చేతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. అతనికి సోకిన ఇన్ఫెక్షన్కు సంబంధించి వైద్యులు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే అతను తన చేతిని కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మంగళవారం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఐదు ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన థోర్ప్... కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ వింత వింతగా ప్రవరిస్తున్నాడు. -
ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్
పునరావాస శిబిరానికి స్టార్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్ సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ విచక్షణ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. సిడ్నీ (2000), ఏథెన్స్ (2004) ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు గెలుచుకోవడమే కాకుండా ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు గె లుచుకున్న తొలి అథ్లెట్‌గానూ 31 ఏళ్ల థోర్ప్ పేరు తెచ్చుకున్నాడు. - పూర్తి షాక్‌లో ఉన్న తను తెల్లవారుజాము 3 గంటలకు సిడ్నీలోని ఓ కుటుంబానికి చెందిన వ్యాన్‌లో కూర్చునేందుకు ప్రయత్నిస్తుండగా 14 ఏళ్ల కుర్రాడు పోలీసులకు ఫోన్ చేశాడు. - దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు థోర్ప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తను పూర్తి దిగ్భ్రమకు లోనై ఉండడమే కాకుండా మత్తులో ఉన్నట్టు తెలిపారు. - అయితే తాము అదుపులో తీసుకున్నది థోర్ప్ అని పోలీసులు వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. థోర్ప్‌ను ఆస్ప్రతికి తీసుకెళ్లడం గత రెండు వారాల్లో రెండోసారి కావడం గమనార్హం. - అయితే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తాము కూడా ఏ చర్యలు తీసుకోలేదని పోలీసులు చెప్పారు. - థోర్ప్ మేనేజిమెంట్ ఈ ఘటనపై స్పందించనప్పటికీ అతడు డిప్రెషన్ చికిత్స కోసం పునరావాస శిబిరానికి వెళ్లినట్టు తెలిపింది. పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్ వల్లే థోర్ప్ స్పృహలో లేకుండా కనిపించాడని చెప్పింది. - 2006లో కెరీర్ నుంచి తప్పుకున్నాక అతడి జీవితం గతి తప్పింది. 2011లో పునరాగమనం చేసినా... జాతీయ జట్టు ట్రయల్స్‌లో విఫలమై 2012 ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి థోర్ప్ కోలుకోలేకపోయాడు.