నేను ‘గే’... ఇదే నిజం | Olympic gold medalist swimmer Ian Thorpe reveals he is gay | Sakshi
Sakshi News home page

నేను ‘గే’... ఇదే నిజం

Published Mon, Jul 14 2014 8:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

నేను ‘గే’... ఇదే నిజం

నేను ‘గే’... ఇదే నిజం

దిగ్గజ స్విమ్మర్ థోర్ప్ స్పష్టీకరణ
 సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ తానో స్వలింగ సంపర్కుడినని స్పష్టం చేశాడు. ఐదు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతను తన లైంగికత్వంపై ఇన్నాళ్లు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ‘బ్రిటిష్ టాక్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియా చానెల్లో ప్రసారమైంది. చాన్నాళ్లుగా ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అనే విమర్శల్ని తోసిపుచ్చిన థోర్ప్ తన హోదాకు తగినట్లు నడుచుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.
 
 ‘నా కుటుంబం, నా దేశం  గర్వపడాలనుకున్నాను. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చాంపియన్ ‘గే’ అనే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదనుకున్నాను. అందుకే ఎప్పటికప్పుడు ఆ విమర్శల్ని ఖండిస్తూ వచ్చాను’ అని థోర్ప్ అన్నాడు.  31 ఏళ్ల థోర్ప్   ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచాడు. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లలో థోర్ప్ 11 స్వర్ణాలు సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement