శృతిమించిన రామ్గోపాల్ వర్మ 'ఎక్సెస్'
భయాన్ని రామ్గోపాల్ వర్మ క్యాష్ చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేదు. ఆయన తెరకెక్కించినన్ని సస్పెన్స్ థిలర్లు ఎవరూ చేయలేదు. 'ఐస్ క్రీమ్'తో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన అదేదారిలో ముందుకు వెళుతున్నారు. ఈసారి 'ఎక్సెస్' అంటూ మరో సస్పెన్స్ థిల్లర్ తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. రామ్గోపాల్ వర్మ సృజనాత్మక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పబ్లిసిటీలో ఆయన అనుసరించే పంథా ఎప్పుడూ విలక్షణంగానూ, వివాదస్పదంగానూ ఉంటుంది.
'ఎక్సెస్'లోనూ అది ప్రస్ఫుతమైంది. తాజాగా విడుదలైన ఎక్సెస్ పోస్టర్లు వర్మ శైలిలోనే ఉన్నాయి. జనాలు ఈ పోస్టర్లు చూసి అవాక్కవుతున్నారు. వర్మకు పైత్యం బాగా ముదిరిందని కామెంట్ చేస్లున్నారు. వర్మ అభిమానులు మాత్రం ఆయన 'క్రియేటివిటీ'ని వెనకేసుకొస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఆరు జీవితాల కథలున్నాయని వర్మ ఊరిస్తున్నారు. ఎక్కువగా వివాదస్పద అంశాలతోనే ప్రచారం పొందే వర్మ 'ఎక్సెస్'కు ఏం చేయనున్నారని సినీ జనాలతో పాటు అభిమానులు చర్చించుకుంటున్నారు.