జేసీ కోటకు బీటలు
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని ఇగుడూరులో శుక్రవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ«ధ్వర్యంలో పలువురు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాజు, గంగాధర్, రామక్రిష్ణ , వెంకట్, విజయ్‌బాబు, గంగయ్య, ఓబయ్య, గంగరాజు, మోహన్, లక్ష్మినారాయణ, చిన్నకంబగిరిలతో పాటు 80 కుటుంబాల వారు పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారందరికీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయకుండా ఎస్సీలను మోసం చేయడంతోనే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. జేసీ సోదరులకు మద్దతుగా ఉన్న గ్రామంలో చీలిక రావడంతో జేసీ కోటకు బీటలు వాలినట్లు అయింది.